తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb28 Update: కేజీఎఫ్ ఫైట్ మాస్ట‌ర్స్‌తో తీసిన‌ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను ప‌క్క‌న పెట్టేసిన త్రివిక్ర‌మ్‌

Ssmb28 Update: కేజీఎఫ్ ఫైట్ మాస్ట‌ర్స్‌తో తీసిన‌ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను ప‌క్క‌న పెట్టేసిన త్రివిక్ర‌మ్‌

15 February 2023, 11:04 IST

  • Ssmb28 Update: మ‌హేష్‌బాబు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న తాజా సినిమా జోన‌ర్‌ను ప్రొడ్యూస‌ర్ సూర్య దేవ‌ర నాగ‌వంశీ రివీల్ చేశాడు. ఈ సినిమా అవుట్‌పుట్‌పై అత‌డు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

మ‌హేష్‌బాబు

Ssmb28 Update: అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత హీరో మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న‌ది. ఎస్ఎస్ఎంబీ 28 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబుతో చేసిన గ‌త చిత్రాల‌కు భిన్నంగా కొత్త స‌బ్జెక్ట్‌తో త్రివిక్ర‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ఈ సినిమాపై నిర్మాత నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌హేష్ త్రివిక్ర‌మ్ మూవీ రూపొందుతోన్న‌ట్లుప్ర‌క‌టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ విష‌యంలో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు హ్యాపీగా ఉన్నార‌ని, రాజ‌మౌళి సినిమాల క‌లెక్ష‌న్స్‌కు ఎస్ఎస్ఎంబీ 28 రీచ్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని చెప్పాడు.

అంతేకాకుండా ఈ సినిమాలో కేజీఎఫ్ ఫైట్ మాస్ట‌ర్స్ సార‌థ్యంలో మ‌హేష్‌బాబుపై ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను త్రివిక్రమ్ చిత్రీక‌రించార‌ని నాగ‌వంశీ అన్నాడు. కానీ ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ అవుట్‌పుట్ విష‌యంలో త్రివిక్ర‌మ్‌తో పాటు తాము ఎవ‌రికి సాటిస్‌ఫాక్ష‌న్ క‌ల‌గ‌లేద‌ని, ఆ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశామ‌ని నిర్మాత అన్నాడు. సినిమాలో దానిని ఉప‌యోగించ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీల క‌నిపించ‌బోతున్న‌ది. త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నాడు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఆగ‌స్ట్ 11క ఈ సినిమా వాయిదాప‌డింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.