తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  South Indian Richest Actors : సౌత్ సినిమాలో టాప్ 5 రిచ్ హీరోలు వీరే..!

South Indian Richest Actors : సౌత్ సినిమాలో టాప్ 5 రిచ్ హీరోలు వీరే..!

Anand Sai HT Telugu

25 July 2023, 9:32 IST

google News
    • South India Richest Heroes : సినిమాల్లో మంచి స్టార్ డమ్ సంపాదిస్తే.. డబ్బు దానంతటే అదే వస్తుంది. కోట్లకు కోట్లు డబ్బు వచ్చేస్తుంది. కానీ సినిమాల్లో నటించేందుకు కూడా చాలా కష్టపడాలి. రెమ్యునరేషన్ పెంచి, బ్రాండ్ ప్రమోషన్స్ తో డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే సౌత్ ఇండియాలో టాప్ 5 రిచ్ హీరోలు ఎవరో తెలుసా?
నాగర్జున, రామ్ చరణ్
నాగర్జున, రామ్ చరణ్ (Twitter)

నాగర్జున, రామ్ చరణ్

ప్రతి సినిమా హిట్ అయితే నటీనటుల రెమ్యునరేషన్(Remuneration) పెరుగుతుంది. ఈ రెమ్యునరేషన్ పెంచుకోవాలంటే.. చాలా కష్టపడాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. కుటుంబానికి దూరంగా షూటింగ్స్ వెళ్లాలి. రోజు కసరత్తులు చేయాలి. ఇలా సినిమా నటులు కావాలంటే.. చాలా హార్డ్ వర్క్ చేయాలి. సినిమాల్లో స్టార్ డమ్ వస్తే.. డబ్బులు కూడా వచ్చేస్తాయి. కొంతమంది నటులు మార్కెట్లో తమకున్న ఇమేజ్ తో బిజినెస్ లోకి కూడా వస్తారు. ఇలా కూడా డబ్బులు సంపాదించేస్తుంటారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వారి వివరాలు చూద్దాం..

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని చాలా మందికి అర్థమైంది. బాలీవుడ్ సినిమాలు వసూళ్లకు ఇబ్బంది పడుతున్న తరుణంలో సౌత్ సినిమాలు(South Movies) దూసుకుపోతున్నాయి. కేజీఎఫ్ 2 , ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు విదేశాల్లోనూ సందడి చేశాయి. హీరోలు కూడా బాగానే వెనకేసుకుంటున్నారు. అలా టాప్ 5 లిస్టు చూస్తే ఎవరు ఉన్నారంటే..

నాగార్జున(Nagarjuna) సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. 100కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం యాక్టింగ్‌లోనే కాకుండా బిగ్‌బాస్‌కి వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. అతని నికర విలువ 3010 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో రామ్‌చరణ్‌(Ram Charan) ఖ్యాతి మరింత పెరిగింది. ఆస్కార్‌లోనూ మెరిశాడు. సౌత్ ధనిక హీరోల వరుసలో రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. రామ్ చరణ్ మొత్తం ఆస్తులు 1370 కోట్లుగా ఉంటుందని అంచనా.

కమల్ హాసన్ టాలెంటెడ్ హీరో. దక్షిణాది భాషలన్నింటిలో నటించాడు. నటనతో పాటు దర్శకత్వం, సినిమా నిర్మాణంలోనూ ఉన్నాడు. ఆయన ఆస్తులు 450 కోట్ల రూపాయలుగా ఉందట.

దళపతి విజయ్(Thalapathy Vijay) ఒక్కో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అతను డిమాండ్ ఉన్న నటుడు. ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. అతని మొత్తం ఆస్తులు రూ.445 కోట్లు.

రజినీకాంత్(Rajinikanth) స్వస్థలం కర్ణాటక. తమిళ సినిమాతో చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ అయ్యాడు. ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ మంచి పేరు సంపాదించాడు. అతని మొత్తం ఆస్తులు 430 కోట్ల రూపాయలు.

భారీగా ఆస్తులు ఉన్న సౌత్ హీరోల్లో ప్రభాస్(Prabhas), మహేశ్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), అజిత్ కుమార్.. ఇలా చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు తమ సంపాదనలో సేవకు కూడా ఉపయోగిస్తుంటారు. ఎన్నో కార్యక్రమాలు చేసే హీరోలూ ఉన్నారు.

తదుపరి వ్యాసం