Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.. ఆ హీరోల అభిమానుల మద్దతు-thalapathy vijay to get support from ajith and rajini fans in politics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.. ఆ హీరోల అభిమానుల మద్దతు

Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.. ఆ హీరోల అభిమానుల మద్దతు

Hari Prasad S HT Telugu
Jul 12, 2023 07:46 AM IST

Thalapathy Vijay: రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న దళపతి విజయ్ కి అజిత్, రజనీకాంత్ అభిమానుల మద్దతు కూడా లభించనుంది. ఇది నిజంగా అతనికి ఓ బూస్ట్ లా పని చేసేదే.

లియో మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్, లోకేష్
లియో మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్, లోకేష్

Thalapathy Vijay: తెలుగులోనే కాదు తమిళనాట కూడా సినిమా నటులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణమే. తాజాగా సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా గత పదేళ్లుగా అక్కడ ఇదే హాట్ టాపిక్. అతడు ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికల సమయానికి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం తన అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులతోనూ విజయ్ సమావేశమయ్యాడు. తన పొలిటికల్ ఎంట్రీపై అతడు వాళ్లతో చర్చించడం విశేషం. పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించడానికి తాను సినిమాకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు కూడా ఈ సందర్భంగా విజయ్ తన అభిమానులకు చెప్పినట్లు సమాచారం.

ఇదే సమావేశంలో తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి చర్చించాడు. విజయ్ రాజకీయ ఎంట్రీకి అవసరమైన అన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమావేశం తర్వాత అతని అభిమానులు వెల్లడించారు. అంతేకాదు రాజకీయాల్లో విజయ్ కి సూపర్ స్టార్ రజినీ, అజిత్ అభిమానుల మద్దతు కూడా ఉన్నట్లు వాళ్లు చెప్పడం విశేషం.

విజయ్ ఈ మధ్యే లియో మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ దళపతి68లో చివరిసారిగా నటించనున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో అతడు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో లియో మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఇప్పుడు లియోతో రాబోతున్నాడు. ఈ మధ్యే లియో నుంచి నా రెడీ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. నా రెడీ పాటను హీరో విజయ్, అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.

ప్రారంభం నుంచి చివరి వరకు మాస్ బీట్‍తో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా నా రెడీ పాట ఉంది. ఈ సాంగ్‍లో నోట్లో బీడీతో విజయ్ మాస్ లుక్‍తో అదిరిపోయేలా ఉన్నాడు. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో ఈ సాంగ్ తెరకెక్కింది. చూడడానికి చాలా గ్రాండ్‍గా కనిపిస్తోంది. మాస్ స్టెప్పులతో విజయ్ రెచ్చిపోయాడు. నా రెడీ పాటకు విష్ణు ఎడవన్.. లిరిక్స్ అందించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం