Kalki 2898 AD YouTube Views : ప్రభాస్ 'కల్కి 2898 AD' యూట్యూబ్ వ్యూస్ అంత తక్కువెందుకు? డబ్బులివ్వలేదా?
Kali 2898 AD Glimpse YouTube Views : ప్రభాస్ సినిమా వస్తుందంటే.. ఇండియా మెుత్తం చూస్తుంది. అంతటి పాన్ ఇండియా స్టార్ నటించిన సినిమా గ్లింప్స్, ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలైతే.. రికార్డులు బద్ధలవుతాయి. కానీ కల్కి విషయానికి వచ్చేసరికి వ్యూస్ తక్కువ ఎందుకు ఉన్నాయి?
కల్కి 2898 AD సినిమా ఫస్ట్ గ్లింప్స్(Kali 2898 AD Glimpse) విడుదలయ్యాయి. చూసిన అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రభాస్(Prabhas)కి మరో సూపర్ హిట్ ఖాయమైనట్టుగా ఫిక్స్ అయిపోయారు. అయితే యూట్యూబ్ వ్యూస్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇలా ఎందుకు జరిగిందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆలోచనల్లో పడ్డారు.
మంచి హిట్ కోసం డార్లింగ్ ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ విజయం సాధించలేదు. అనుకున్నంతగా ఆడలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్(Adipurush) పరాజయం పాలయ్యాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కె అదే.. కల్కి 2898 AD సినిమా ద్వారా విజయం సాధించాలి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. మంచి క్రేజ్ వచ్చింది. అంతా దీనిగురించి మాట్లాడుకున్నారు. కానీ వీడియో ఆశించిన స్థాయిలో వీక్షణలను పొందడంలో విఫలమైంది. మూడు రోజుల గ్లింప్స్ వీడియో కేవలం 18 మిలియన్ల వీక్షణలను మాత్రమే పొందింది. అందుకు కారణం ఏంటని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం సలార్ సినిమా టీజర్(Salaar Teaser) విడుదలైంది. కొద్ది గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 24 గంటల్లోనే 83 మిలియన్ల మంది వీక్షించారు. దానితో పోలిస్తే కల్కి 2898 AD సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి వచ్చిన వ్యూస్ (3 రోజుల్లో 18 మిలియన్లు) చాలా తక్కువ. ఇలా ఎందుకు జరిగిందో అని ప్రభాస్ ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, యూట్యూబ్‌లో ఏదైనా నిర్దిష్ట వీడియోకు భారీ మొత్తంలో వ్యూస్ రావాలంటే, డబ్బు ఇచ్చి ప్రచారం చేయాల్సి ఉంటుంది. చాలా సినిమా టీమ్‌లు తమ పాటలను, టీజర్‌లను, ట్రైలర్‌లను ఈ విధంగా ప్రమోట్ చేస్తూ ఎక్కువ వ్యూస్‌ని పొందుతాయి. కానీ 'కల్కి 2898 AD' బృందం అలా ప్రచారం చేయలేదు. వారి వ్యూహం వేరు. వీక్షణల కోసం డబ్బు చెల్లించడం కంటే ఆర్గానిక్‌గా ప్రజలకు చేరువవ్వడమే ఈ చిత్ర బృందం లక్ష్యం. కాబట్టి తక్కువ వీక్షణలు ఉన్నాయి. దీంతో సినిమాపై జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది.
కల్కి 2898 ADలో ప్రభాస్‌తోపాటు పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తదితరులు కనిపించనున్నారు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కుతోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో చూసి రాజమౌళి కూడా ఇంప్రెస్ అయ్యాడు. చాలా మంది స్పందించారు. మళ్లీ బాక్సాఫీసును షేక్ చేసేందుకు ప్రభాస్ వస్తున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.