Kurangu Pedal OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న శివకార్తికేయన్ అవార్డ్ విన్నింగ్ మూవీ- తెలుగులోనూ రిలీజ్
03 June 2024, 12:28 IST
Kurangu Pedal OTT: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన తమిళ మూవీ కురంగు పెడల్ త్వరలో ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ డ్రామా మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కురంగు పెడల్
Kurangu Pedal OTT: తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్నాడు శివకార్తికేయన్. ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. లో బడ్జెట్ సినిమాల నిర్మాణం కోసం శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ బ్యానర్‌ను నెలకొల్పాడు శివకార్తికేయన్.
కురంగు పెడల్ మూవీ...
ఈ బ్యానర్‌పై శివకార్తికేయన్ నిర్మించిన తాజా మూవీ కురంగు పెడల్. ఈ తమిళ డ్రామా మూవీకి కమల కన్నన్ దర్శకత్వం వహించారు. కాళీ వెంకట్‌తో పాటు సంతోష్‌వేళ్‌మురుగన్, వీఆర్ రాఘవన్, ఎమ్ గణశేఖర్, రతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 3న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
ఆహా ఓటీటీ...
కురంగు పెడల్ మూవీ ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా వెల్లడించింది. మూవీ పోస్టర్‌ను పంచుకున్నది. జూన్ 14న కురంగు పెడల్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. తెలుగులోనూ ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. తమిళంలో రిలీజైన వారం, రెండు వారాల గ్యాప్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ రానున్నట్లు సమాచారం.
1980 బ్యాక్‌డ్రాప్...
1980 బ్యాక్‌డ్రాప్‌లో చైల్డ్‌హుడ్ మెమోరీస్‌ను గుర్తుచేస్తూ దర్శకురాలు కమల కన్నన్ ఈ మూవీని తెరకెక్కించింది. సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తనకు సైకిల్ నడపటం రాని ఓ తండ్రి కొడుకుకు ఎలా నేర్పించాడు.ఈ ప్రయాణంలో తండ్రీకొడుకులు ఎదుర్కొన్న భావోద్వేగాల చుట్టూ ఈ కథను నడిపించారు డైరెక్టర్. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిన్న సినిమా ఇఫితో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ఇండియన్ పనోరమా విభాగానికి సెలెక్ట్ అయ్యింది.
సాయిపల్లవి అమరన్...
ప్రస్తుతం తమిళంలో అమరన్ అనే సినిమా చేస్తోన్నాడు శివకార్తికేయన్. తమిళనాడుకు చెందిన ఆర్మీ ఆఫీసన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో కమల్‌హాసన్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
శివకార్తికేయన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి రాజ్‌కుమార్ పెరియాసామీ దర్శకత్వం వహిస్తోన్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. శివకార్తికేయన్, సాయిపల్లవి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గార్గి అనంతరం దాదాపు రెండేళ్ల బ్రేక్ తర్వాత తమిళంలో సాయిపల్లవి చేస్తోన్న మూవీ ఇది.
మురుగదాస్‌తో...
మురుగదాస్‌తో...
అమరన్ తర్వాత సీనియర్ డైరెక్టర్ మురుగదాస్‌తో శివకార్తికేయన్ ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. సప్త సాగర దాచే ఎల్లో సినిమాతో దక్షిణాదిలో పాపులర్ అయ్యింది రుక్మిణి వసంత్..