Hyderabad : మన హైదరాబాద్‍లో 'హైటెక్‌ సోలార్ సైకిల్‌ ట్రాక్‌' - దేశంలోనే తొలిసారి..! ప్రత్యేకతలివే-new solar roof top cycle track in hyderabad check full details are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyderabad : మన హైదరాబాద్‍లో 'హైటెక్‌ సోలార్ సైకిల్‌ ట్రాక్‌' - దేశంలోనే తొలిసారి..! ప్రత్యేకతలివే

Hyderabad : మన హైదరాబాద్‍లో 'హైటెక్‌ సోలార్ సైకిల్‌ ట్రాక్‌' - దేశంలోనే తొలిసారి..! ప్రత్యేకతలివే

Oct 01, 2023, 11:19 AM IST Maheshwaram Mahendra Chary
Oct 01, 2023, 11:19 AM , IST

  • Solar Roof Cycling Track in Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు సరికొత్త సైకిల్ ట్రాక్ సిద్ధమైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది HMDA. ఆదివారం మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ ను ప్రారంభించనున్నారు. ఈ హైటెక్ సైకిల్ ట్రాక్ ప్రత్యేకతలెంటో చూద్దాం

ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి  సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకేసారి 23 కి.మీ పొడవుతో కలిగిన  గ్రీన్‌ ఫీల్డ్‌ సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

(1 / 6)

ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి  సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకేసారి 23 కి.మీ పొడవుతో కలిగిన  గ్రీన్‌ ఫీల్డ్‌ సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. (Twitter)

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంబడి నార్సింగి-గండిపేట మార్గంలో ఈ ‘సోలార్‌ రూఫ్‌టాప్‌ సైకిల్‌ ట్రాక్‌’ పూర్తి అయింది.

(2 / 6)

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంబడి నార్సింగి-గండిపేట మార్గంలో ఈ ‘సోలార్‌ రూఫ్‌టాప్‌ సైకిల్‌ ట్రాక్‌’ పూర్తి అయింది.(Twitter)

సుమారు రూ.100 కోట్ల వ్యయంతో  4.25 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లల్లో ఈ ట్రాక్ నిర్మించారు.  నానక్ రాంగూడ నుంచి తెలంగాణ  పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు… అలాగే నర్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 .5 కిలోమీటర్ల వరకు నిర్మించారు. 

(3 / 6)

సుమారు రూ.100 కోట్ల వ్యయంతో  4.25 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లల్లో ఈ ట్రాక్ నిర్మించారు.  నానక్ రాంగూడ నుంచి తెలంగాణ  పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు… అలాగే నర్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 .5 కిలోమీటర్ల వరకు నిర్మించారు. (Twitter)

 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ కలిగిన ఈ ట్రాక్ 16 మెగా  వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది.  సైకిలిస్టులు సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు పార్కింగ్  ఏరియా సౌకర్యం ఉంటుంది.ట్రాక్ అంతటా సీక్రెట్ కెమెరాలతో నిఘా ఉంటుంది 

(4 / 6)

 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ కలిగిన ఈ ట్రాక్ 16 మెగా  వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది.  సైకిలిస్టులు సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు పార్కింగ్  ఏరియా సౌకర్యం ఉంటుంది.ట్రాక్ అంతటా సీక్రెట్ కెమెరాలతో నిఘా ఉంటుంది (Twitter)

ఈ ట్రాక్ పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.సందర్శకులకు మరియు సైకిలిస్ట్ లకు త్రాగు నీరు సదుపాయం ఉంటుంది. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. విశ్రాంతించేందుకు విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు,

(5 / 6)

ఈ ట్రాక్ పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.సందర్శకులకు మరియు సైకిలిస్ట్ లకు త్రాగు నీరు సదుపాయం ఉంటుంది. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. విశ్రాంతించేందుకు విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు,(Twitter)

సైకిల్ రిపేర్ స్టోర్లు తో పాటు అద్దె సైకిల్ స్టోర్ లు కూడా ఇక్కడ ఉంటాయని హెచ్ఎండీ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ట్రాక్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఈ ట్రాక్ ను అభివృధ్ది చేసినట్లు అధికారులు వివరించారు..

(6 / 6)

సైకిల్ రిపేర్ స్టోర్లు తో పాటు అద్దె సైకిల్ స్టోర్ లు కూడా ఇక్కడ ఉంటాయని హెచ్ఎండీ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ట్రాక్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఈ ట్రాక్ ను అభివృధ్ది చేసినట్లు అధికారులు వివరించారు..(Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు