తెలుగు న్యూస్  /  Entertainment  /  Siri Hanmanth Gets Surprised Lover Shrihan And Inaya Sultana Mother Came To Bigg Boss House

Bigg Boss 6 Telugu 82 episode: శ్రీహాన్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన సిరిహ‌నుమంతు - కీర్తి కోసం హౌజ్‌కు వ‌చ్చిన మ‌హేష్‌

25 November 2022, 8:57 IST

  • Bigg Boss 6 Telugu 82 episode: బిగ్‌బాస్ హౌజ్‌లోకి గురువారం శ్రీహాన్ ల‌వ‌ర్ సిరి హ‌నుమంతు వ‌చ్చింది. హౌజ్‌మేట్స్ అంద‌రిపై పంచ్‌లు వేసి న‌వ్వించింది. ఆ త‌ర్వాత కీర్తి ఫ్రెండ్ మ‌హేష్‌తో పాటు ఇనాయా మ‌ద‌ర్ కూడా హౌజ్‌లోకి వ‌చ్చారు.

శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌
శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌

శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌

Bigg Boss 6 Telugu 82 episode: బిగ్‌బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్ ఎంట్రీ ఇస్తూ షోను ఎమోష‌న‌ల్‌గా మార్చేస్తున్నారు. గురువారం బిగ్‌బాస్ హౌజ్‌లోకి శ్రీహాన్ ల‌వ‌ర్ సిరి హ‌నుమంతు వ‌చ్చింది. తొలుత హౌజ్‌మేట్స్ అంద‌రూ ఫ్రీజ్ అంటూ బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత‌ శ్రీహాన్ రిలీజ్ అంటూ వెంట‌నే అనౌన్స్ చేయ‌డంతో శ్రీహాన్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ‌చ్చార‌ని అనుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

కానీ అలాంటిదేమీ లేదంటూ అత‌డిని కొద్దిసేపు స‌స్పెన్స్‌లో ఉంచాడు బిగ్‌బాస్‌. స‌డెన్‌గా శ్రీహాన్ ల‌వ‌ర్ సిరి హ‌నుమంతు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి శ్రీహాన్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఏడ్చేశాడు. శ్రీహాన్‌ను ముద్దులు ఇస్తూ మురిపించింది సిరి . ఏడిస్తే ముద్దులు పెట్ట‌డం ఆపేస్తాన‌ని అన్న‌ది. శ్రీహాన్ చూసి చాలా స‌న్న‌బ‌డిపోయావ‌ని, నీ ఫుడ్ మొత్తం శ్రీస‌త్య‌నే తింటుంద‌ని సిరి హ‌నుమంతు అన్న‌ది. ఆదిరెడ్డితో పాటు అంద‌రిని టీజ్ చేసింది సిరి. ఆదిరెడ్డి రివ్యూస్‌ను ఇమిటేట్ చేసి న‌వ్వించింది. శ్రీహాన్ పేరును మెడ‌పై టాటూగా వేసుకున్న‌ట్లు చెప్పింది.

శ్రీహాన్ కొడుకు కూడా వ‌చ్చేశాడు...

ఆ త‌ర్వాత శ్రీహాన్ కొడుకు చైతూ కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంద‌రిని న‌వ్వించాడు. హౌజ్‌మేట్స్‌ను ఇమిటేట్ చేశాడు. టాస్క్‌ల‌లో ఎమోష‌న్స్‌, బాండింగ్ పెట్టుకోవ‌ద్ద‌ని శ్రీహాన్‌కు స‌ల‌హాలు ఇచ్చింది సిరి. ఆ త‌ర్వాత సిరి, శ్రీహాన్ క‌లిసి డ్యాన్స్ చేశారు. చైత‌న్య త‌న సొంత కొడుకు కాద‌ని, చిన్న‌ప్ప‌టి నుంచి తమ ద‌గ్గ‌రే పెరిగిన‌ట్లు శ్రీహాన్ చెప్పాడు. అందుకే త‌న‌ను డాడీ అని పిలుస్తాడ‌ని అన్న‌ది. మిడ్‌నైట్ బాత్‌రూమ్ వెళ్లిన రాజ్‌ను రేవంత్‌, శ్రీహాన్ క‌లిసి భ‌య‌పెట్టారు.

ఇనాయా మ‌ద‌ర్ ఎంట్రీ...

ఆ త‌ర్వాత బిగ్‌బాస్ క్లాస్ రూమ్ టాస్క్‌లో యోగా టీచ‌ర్‌గా మారిన రేవంత్ ఆస‌నాలు నేర్పించాడు. స‌ర‌దాగా ఈ టాస్క్ సాగింది. ఆ త‌ర్వాత కీర్తి కోసం మ‌హేష్‌వ‌చ్చాడు. కీర్తికి రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇచ్చి ప్ర‌పోజ్ చేశాడు. ఇద్ద‌రు క‌లిసి మ‌నోహ‌ర పాట‌కు డ్యాన్స్ చేశారు. ఆమెలోని బాధ‌ను మొత్తం దూరం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు మ‌హేష్‌. ఇనాయా మ‌ద‌ర్ కూడా హౌజ్‌లోకి వ‌చ్చింది. అమ్మ‌ను చూసి ఇనాయా ఏడ్చేసింది. అంద‌రూ బాగా ఆడుతున్నార‌ని మెచ్చుకున్న‌ది. ఆదిరెడ్డి డ్యాన్స్ బాగుంద‌ని మెచ్చుకున్న‌ది. ఇనాయా కెప్టెన్ అయితే చూడాల‌ని ఉంద‌ని చెప్పింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.