తెలుగు న్యూస్  /  Entertainment  /  Sardar Twitter Review Says The Movie Is A Blockbuster Hit

Sardar Twitter Review: సర్దార్‌ బ్లాక్‌బస్టర్‌.. ఫస్టాఫ్‌ అదిరిందంటున్న ఫ్యాన్స్

HT Telugu Desk HT Telugu

21 October 2022, 10:01 IST

    • Sardar Twitter Review: సర్దార్‌ బ్లాక్‌బస్టర్‌ అని తేల్చేశారు ఫ్యాన్స్‌. ముఖ్యంగా ఫస్టాఫ్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిందంటూ శుక్రవారం (అక్టోబర్‌ 21) ఉదయం నుంచీ ట్వీట్లు చేస్తున్నారు.
సర్దార్ మూవీలో కార్తీ
సర్దార్ మూవీలో కార్తీ

సర్దార్ మూవీలో కార్తీ

Sardar Twitter Review: తమిళ స్టార్‌ హీరో కార్తీ నటించిన మూవీ సర్దార్‌. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ శుక్రవారం (అక్టోబర్‌ 21) రిలీజైంది. ఈ సినిమాకు యూఎస్‌ ప్రీమియర్స్‌ నుంచి పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్‌ ఉదయం నుంచీ ట్విటర్‌లో బ్లాక్‌బస్టర్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీపావళి విన్నర్‌ సర్దార్‌ అని వాళ్లు తేల్చేశారు.

ట్రెండింగ్ వార్తలు

HHVM Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌

Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ముఖ్యంగా ఈ సినిమా ఫస్టాఫ్‌, ఇంటర్వెల్‌ సీన్‌ చాలా బాగుందని చాలా మంది ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. ఈ మూవీతో మంచి మెసేజ్‌ ఇచ్చారని, పీఎస్‌ మిత్రన్‌ డైరెక్షన్‌, స్క్రీన్‌ ప్లే అదుర్స్‌ అని కామెంట్స్‌ చేశారు. ఈ సినిమాతో కార్తీ మరో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడని, 2022 అతనికి చాలా బాగా కలిసి వచ్చిందని మరికొందరు ట్వీట్లు చేశారు.

సర్దార్‌ మూవీని తెలుగులో అక్కినేని నాగార్జున రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో తీసుకురావడం చాలా గర్వంగా ఉందని ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా నాగార్జున అన్నాడు. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న కార్తీకి ఊహించినట్లే మంచి ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. దీపావళి సందర్భంగా మరో మూడు సినిమాలతో పోటీ పడుతున్నా.. సర్దార్‌ రేసులో అన్నింటికంటే ముందే ఉంది.

డిఫరెంట్‌ స్క్రిప్ట్‌లను ఎంచుకొని సినిమాలు చేసే కార్తీ.. సర్దార్‌తో మరోసారి అదే నిరూపించాడని ఫ్యాన్స్‌ ట్విటర్ రివ్యూల్లో అంటున్నారు. సినిమా మొత్తం ఎక్కడా బోర్‌ కొట్టకుండా చాలా అద్భుతంగా తీశారని చెప్పారు. డ్యుయల్‌ రోల్‌లో కార్తీ అదరగొట్టాడని, ముఖ్యంగా సీనియర్‌ రోల్‌లో అతని నటన అద్భుతమని మరో అభిమాని ట్వీట్‌ చేశాడు. స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు ఎక్కువ మంది ట్వీట్స్‌ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.