Laapataa Ladies: నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్‌ను బీట్ చేసిన చిన్న సినిమా - సందీప్ వంగాను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
23 May 2024, 13:05 IST
Laapataa Ladies: ఓటీటీలో కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ దుమ్మురేపుతోంది. ఓటీటీలో వ్యూస్ పరంగా సందీప్ వంగా యానిమల్ మూవీని బీట్ చేసింది.
లాపతా లేడీస్
Laapataa Ladies: ఓటీటీలో లాపతా లేడీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిన్న సినిమా రణ్‌భీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల సినిమాలను దాటేసి రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. లాపతా లేడీస్ మూవీకి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించింది. దర్శకురాలిగా ఇది ఆమెకు సెకండ్ మూవీ. సెటైరికల్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
రికార్డ్ వ్యూస్...
స్టార్స్ ఎవరూ లేని ఈ చిన్న సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. లాపతా లేడీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై నెల రోజులు కూడా కాకముందే 13.8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన బాలీవుడ్ మూవీస్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న మూవీలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ జాబితాలో హృతిక్ రోషన్ ఫైటర్ 14 మిలియన్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది.
యానిమల్‌ను బీట్ చేస్తూ...
ఓటీటీ స్ట్రీమింగ్ వ్యూస్ పరంగా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌ను లాపతా లేడీస్ దాటేయడం బాలీవుడ్‌లో హట్‌టాపిక్‌గా మారింది. హీరో రణ్‌భీర్‌కపూర్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో రూపొందిన యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజైంది. యానిమల్ ఓటీటీలో విడుదలై నాలుగు నెలలు దాటింది. ఇప్పటివరకు ఈ మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో 13.6 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్ వ్యూస్ వచ్చాయి. యానిమల్ మూవీ రికార్డును నెల రోజులు కూడా దాటకముందే లాపతా లేడీస్ దాటేసింది.
సందీప్ వంగాపై ట్రోల్స్...
లాపతా లేడీస్, యానిమల్ ఓటీటీ వ్యూస్‌ను కంపేర్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ ట్రోల్ చేస్తున్నారు. గొప్ప సినిమాలు తీశానని భ్రమలో ఉన్న సందీప్ వంగాకు కనువిప్పులాంటి సినిమా ఇదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సందీప్ వంగాకు దారుణమైన అవమానం ఇదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్‌తో పాటు కథ, కథనాల పరంగా లాపతా లేడీస్ బెస్ట్ మూవీ అని అంటోన్నారు. ఈ ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
సందీప్ వంగా సినిమాలు చూడను...
గతంలో లాపతా లేడీస్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతోన్న టైమ్‌లో సందీప్ వంగా యానిమల్ మూవీ గురించి మాట్లాడటానికి కిరణ్ రావ్ తిరస్కరించింది. సందీప్ వంగా సినిమాలను తాను చూడనని, అతడి సినిమాల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదంటూ పేర్కొన్నది. ఆ కామెంట్స్ చేసినప్పటి నుంచే కిరణ్ రావ్‌ను సందీప్ వంగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ రికార్డును లాపతా లేడీస్ అధిగమించడంలో సందీప్ వంగాను కిరణ్ రావ్‌తో పాటు ఆమిర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తోన్నారు.
ఆమిర్‌ఖాన్‌తో కలిసి...
లాపతా లేడీస్ మూవీలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ , రవికిషన్, ఛాయా కదమ్ కీలక పాత్రలు పోషించారు. మాజీ భర్త ఆమిర్‌ఖాన్‌తో కలిసి కిరణ్ రావ్ ఈ మూవీని నిర్మించింది.
లాపతా లేడీస్ కథ ఇదే…
దీపక్ కుమార్ (స్పర్శ్ శ్రీవాత్సవ), పూల్ కుమారి (నితాన్షి గోయల్)కు వివాహం అవుతుంది. ఆ తర్వాత దీపక్ సొంత ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ ఓ రైలు ఎక్కుతారు. అదే ట్రైన్‍లో కొత్తగా పెళ్లయిన మరికొన్ని జంటలు ఉంటాయి. కొత్త పెళ్లి కూతుళ్లందరూ ముఖానికి ముసుగు వేసుకొని.. దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు.
పూల్ బదులు పుష్పరాణి...
కొత్తగా పెళ్లయిన పుష్ప రాణి అలియాజ్ జయ (ప్రతిభ రంట) వద్ద రైలులో దీపక్ కుమార్, పూల్ కూర్చుంటారు. అయితే, దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ పూల్‍ను కాకుండా పుష్ప రాణిని దీపక్ తీసుకెళతాడు. ముసుగు ఉండటంతో దీపక్‍ను పుష్ప చూడలేకపోతుంది. అయితే, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆమె పూల్ కాదు.. పుష్పరాణి అని తెలుసుకొని దీపక్, వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. పూల్ కోసం దీపక్ వెతుకుతాడు. పూల్ ఓ రైల్వే స్టేషన్‍లో దిగి దిక్కుతోచని పరిస్థితులో ఉంటుంది. అసలు ఈ పుష్పరాణి ఎవరు? పూల్‍కు ఏమైంది? దీపక్‍కు ఆమె దొరికిందా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే లాపతా లేడీస్ కథ.