Jr NTR Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్-jr ntr hrithik roshan banter in social media x gone viral fans wondering whether tarak teaching hrithik how to cook ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్

Jr NTR Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్

Hari Prasad S HT Telugu
May 21, 2024 08:17 AM IST

Jr NTR Hrithik Roshan: జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు వంట నేర్పిస్తున్నాడా? తారక్ బర్త్ డే సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ఎక్స్ లో జరిగిన సరదా సంభాషణ చూస్తే అదే అనిపిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్

Jr NTR Hrithik Roshan: జూనియర్ ఎన్టీఆర్ సోమవారం (మే 20) తన పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతనికి ఎంతో మంది ప్రముఖులు విషెస్ చెప్పారు. అందులో అతని వార్ 2 మూవీ కోస్టార్ హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. అయితే ఈ బాలీవుడ్ స్టార్ హీరో తారక్ కు బర్త్ డే విషెస్ చెప్పిన విధానం చూస్తుంటే ఎన్టీఆర్ అతనికి వంట చేయడం నేర్పిస్తున్నాడా అన్న డౌట్ కలుగుతోంది.

తారక్‌కు హృతిక్ విషెస్

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలోనే హృతిక్ తో స్నేహ బంధం బలపడినట్లుంది. తాజాగా తారక్ బర్త్ డే సందర్భంగా హృతిక్ విషెస్ చెప్పాడు.

"హ్యాపీ బర్త్ డే టు యు తారక్. సూర్యుడి చుట్టూ మరో రౌండ్ పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఈసారి మనం ఇద్దరం కలిసి తిరుగుదాం. అది పూర్తయ్యే లోపు కిచెన్ లో ఉన్న స్టూడెంట్ ను చూసి మాస్టర్ గర్విస్తాడని భావిస్తున్నాను. హ.. హ.." అని హృతిక్ ట్వీట్ చేశాడు. దీనికి తారక్ కూడా అంతే సరదాగా స్పందించాడు.

వచ్చేస్తున్నా: ఎన్టీఆర్

హృతిక్ బర్త్ డే విషెస్ పై తారక్ వెంటనే స్పందించాడు. "హ.. హ.. థ్యాంక్యూ సో మచ్ సర్. సెట్స్ లో మీతో మంచి సరదా యుద్ధం చేశాను. మరోసారి మీతో కలిసి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. స్టూడెంట్ సిద్ధంగా ఉంటే టీచర్ ప్రత్యక్షమవుతాడని అంటారు. మీరు సిద్ధంగా ఉన్నారు" అని తారక్ రిప్లై ఇవ్వడం విశేషం.

ఈ ఇద్దరి సరదా సంభాషణ చూసి హృతిక్ కు తారక్ వంట నేర్పిస్తున్నాడని కొందరు ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇక మరికొందరు మాత్రం అసలు వీళ్లలో గురువు ఎవరు, స్టూడెంట్ ఎవరు అన్న ప్రశ్నలు వేస్తున్నారు. మాస్టర్, స్టూడెంట్, కిచెన్ అంటే ఏంటో అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వార్ 2 మూవీ ఏంటంటే?

వార్ 2 మూవీ ఆదిత్య చోప్రాకు చెందిన యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మరో మూవీ. గతంలో వార్ మూవీ రాగా.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వార్ 2 రానుంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులోనూ హృతిక్ లీడ్ రోల్లో కనిపిస్తున్నాడు. అయితే ఈసారి వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఓ నెగటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే అతని రోల్, లుక్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే ముంబైలో ఈ ఇద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకున్నారు. వార్ 2 మూవీలో కబీర్ అనే రా ఏజెంట్ పాత్రలోనే హృతిక్ కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణను డీకోడ్ చేసే పనిలో ఫ్యాన్స్ ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024