OTT Telugu Movies This week: ఈ వారంలో ఓటీటీల్లోకి 2 డిఫరెంట్ కాన్సెప్ట్ తెలుగు సినిమాలు.. మిస్ అవొద్దు
OTT Telugu Movies this Week: ఆరంభం, ప్రసన్న వదనం సినిమాలు డిఫరెంట్ కాన్టెప్ట్‌లతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలు ఈ వారమే ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. థియేటర్లలో రిలీజై నెల తిరగకుండానే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి.
OTT Telugu Movies this Week: ఈనెలలో ప్రసన్న వదనం, ఆరంభం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. రెగ్యులర్‌గా కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ఈ చిత్రాలు వచ్చాయి. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమా ఫేస్ బ్లైండ్‍నెస్ అనే కాన్సెప్ట్‌తో వచ్చింది. సైన్స్ ఫిక్షన్ మూవీ ఆరంభం.. డెజా వూ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ప్రసన్న వదనం, ఆరంభం సినిమాలు ఇదే వారంలో ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు రానున్నాయి.
ఆరంభం
మోహన్ భగత్ హీరోగా నటించిన ‘ఆరంభం’ సినిమా ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తించింది. అజయ్ నాగ్ వీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి క్యూరియాసిటీ కలిగించింది. ఈ చిత్రం మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ తరుణంలో థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోగానే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఆరంభం సినిమా రేపు (మే 23) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఓటీటీలో ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ మోహన్ భగత్‍తో పాటు సుప్రితా సత్యనారాయణ్, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, అభిషేక్ కీలకపాత్రలు పోషించారు.
డె జావు, టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఆరంభం చిత్రాన్ని దర్శకుడు అజయ్ నాగ్ తెరకెక్కించారు. అభిషేక్ వీ తిరుమలేశ్ నిర్మించిన ఈ చిత్రానికి సింజీత్ ఎర్రమల్లి సంగీతం అందించారు. రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయవచ్చు.
ప్రసన్న వదనం
యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘ప్రసన్న వదనం’ థ్రిల్లర్ సినిమా మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మనుషుల ముఖాలు గుర్తించలేని ఫ్లేస్ బ్లైండ్‍నెస్ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ వైకే తెరకక్కించారు. ప్రసన్న వదనం సినిమా మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఆహా ఓటీటీలో ఓటీటీలో అడుగుపెడుతోంది.
ప్రసన్న వదనం సినిమా మే 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారికి 24 గంటలు మందుగా ఏప్రిల్ 23వ తేదీనే అందుబాటులోకి వస్తుంది. సాధారణ సబ్‍స్క్రైబర్లకు మే 24న స్ట్రీమింగ్‍కు వస్తుంది.
ప్రసన్న వదనం చిత్రానికి అర్జున్ వైకే దర్శకత్వం వహించగా.. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. ఎస్.చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.5కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.