తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan Long Hair Look: స‌ల్మాన్‌ఖాన్ సినిమాకు టైటిల్ ఫిక్స్ - కొత్త లుక్ అదిరిందిగా

Salman Khan Long Hair Look: స‌ల్మాన్‌ఖాన్ సినిమాకు టైటిల్ ఫిక్స్ - కొత్త లుక్ అదిరిందిగా

HT Telugu Desk HT Telugu

05 September 2022, 12:55 IST

  • Salman Khan: స‌ల్మాన్‌ఖాన్, పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్న బాలీవుడ్ సినిమా టైటిల్ తో  పాటు వీడియో గ్లింప్స్ సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో కొత్త లుక్ లో సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఏదంటే...

కిసి కా భాయ్ కిసి కి జాన్
కిసి కా భాయ్ కిసి కి జాన్ (Twitter)

కిసి కా భాయ్ కిసి కి జాన్

Salman Khan: తేరేనామ్ మిన‌హా లాంగ్ హెయిర్ స్టైల్‌తో బాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించలేదు. మ‌రోసారి ఈ లుక్‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. అత‌డు హీరోగా న‌టిస్తున్నతాజా చిత్రానికి కిసి కా భాయ్ కిసి కి జాన్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ లుక్‌తో కూడిన వీడియో గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఇందులో లాంగ్ హెయిర్ స్టైల్‌తో స‌ల్మాన్‌ఖాన్ కొత్త లుక్‌లో క‌నిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

ఈ వీడియో గ్లింప్స్‌లో స‌ల్మాన్ ఖాన్ ఎడారి ప్రాంతంలో స్టైలిష్ గా న‌డ‌చుకుంటూ వెళుతుండ‌టం ఆక‌ట్టుకుంటోంది. లాంగ్ హెయిర్ స్టైల్‌తో కూడిన ఆయ‌న లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియో గ్లింప్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తోంది. కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

స‌ల్మాన్‌ ఖాన్ సరసన పూజాహెగ్డే న‌టిస్తున్న తొలి సినిమా ఇది. ఇటీవ‌లే కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను ల‌ఢ‌క్‌లో స‌ల్మాన్‌ఖాన్‌, పూజాహెగ్డేల‌పై చిత్రీక‌రించారు. ఈ సినిమాకు తొలుత క‌భీ ఈద్ క‌భీ దివాళీ అనే టైటిల్ అనుకున్నారు. ఆ త‌ర్వాత భాయిజాన్ పేరును ప‌రిశీలించారు. అవేవీ కాకుండా కొత్త టైటిల్‌ను అనౌన్స్ చేసి స‌ర్‌ప్రైజ్ చేశారు.

ఈ ఏడాది చివ‌ర‌లో ఈసినిమా ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా న‌టిస్తున్న‌గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.