తెలుగు న్యూస్  /  Entertainment  /  Salman Khan Announces New Release Date Of Tiger 3

Salman Khan Tiger 3 Release Date: టైగ‌ర్ 3 పోస్ట్‌పోన్ - కొత్త రిలీజ్ డేట్ రివీల్ చేసిన స‌ల్మాన్‌ఖాన్‌

15 October 2022, 16:45 IST

  • Salman Khan Tiger 3 Release Date: స‌ల్మాన్‌ఖాన్ టైగ‌ర్ 3 సినిమా వాయిదా ప‌డింది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను శ‌నివారం స‌ల్మాన్‌ఖాన్ రివీల్ చేశాడు.

స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినాకైఫ్‌
స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినాకైఫ్‌

స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినాకైఫ్‌

Salman Khan Tiger 3 Release Date: స‌ల్మాన్‌ఖాన్ కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌గా టైగ‌ర్ సిరీస్ నిలిచింది. ఈ ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన ఏక్ థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. ఇండియా వైడ్‌గా అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల జాబితాలో చోటును ద‌క్కించుకున్నాయి. ఈ సిరీస్‌లో ప్ర‌స్తుతం మూడో భాగం రూపొందుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

Guppedantha Manasu Serial: దేవ‌యాని త‌ప్పుకు శైలేంద్ర‌కు శిక్ష - మ‌నుకు షాకిచ్చిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి వ‌సు స‌పోర్ట్

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

టైగ‌ర్ 3 పేరుతో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను శ‌నివారం స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌క‌టించాడు. 2023 దీపావ‌ళికి టైగ‌ర్ 3ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. టైగ‌ర్ 3లో త‌న లుక్‌కు సంబంధించిన కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు స‌ల్మాన్‌ఖాన్‌. ఇందులో క‌ళ్లు మాత్ర‌మే క‌నిపించేలా ముఖానికి ముసుగు ధ‌రించి ఇంటెన్స్ లుక్‌లో స‌ల్మాన్‌ఖాన్ క‌నిపిస్తున్నాడు.

ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా తొలుత ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు గ‌తంలో చిత్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో దీపావ‌ళికి వాయిదా వేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా క‌త్రినా కైఫ్ (Katrina Kaif) హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగ‌ర్ పాత్ర‌లో మ‌రోసారి స‌ల్మాన్‌ఖాన్ క‌నిపించ‌నుండ‌గా జోయా అనే పాత్ర‌లో క‌త్రినా న‌టిస్తోంది. టైగ‌ర్ 3ని బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. టైగ‌ర్ 3లో బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్‌ఖాన్‌(Shahrukh khan), హృతిక్ రోష‌న్ (Hrithik Roshan)గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.