తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rukmini Vasanth: టాలీవుడ్‌లోకి మ‌రో క‌న్న‌డ బ్యూటీ ఎంట్రీ - స‌ప్త‌సాగ‌రాలు దాటి హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ రొమాన్స్‌

Rukmini Vasanth: టాలీవుడ్‌లోకి మ‌రో క‌న్న‌డ బ్యూటీ ఎంట్రీ - స‌ప్త‌సాగ‌రాలు దాటి హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ రొమాన్స్‌

27 July 2024, 6:19 IST

google News
  • Rukmini Vasanth: టాలీవుడ్‌లోకి మ‌రో క‌న్న‌డ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ క‌వికిర‌ణ్ కోలా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం.

రుక్మిణి వ‌సంత్
రుక్మిణి వ‌సంత్

రుక్మిణి వ‌సంత్

Rukmini Vasanth: టాలీవుడ్‌లో క‌న్న‌డ హీరోయిన్ల‌దే డామినేష‌న్ క‌నిపిస్తుంటుంది. అనుష్క‌, ర‌ష్మిక మంద‌న్న‌, పూజాహెగ్డే, కృతిశెట్టి, నేహా శెట్టి...ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్‌ను ఏలుతోన్న‌క‌న్న‌డ హీరోయిన్ల లిస్ట్ చాలా పెద్ద‌గానే క‌నిపిస్తుంది. తాజాగా మ‌రో క‌న్న‌డ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

స‌ప్త‌సాగ‌రాలు దాటి హీరోయిన్‌...

స‌ప్త సాగ‌రాలు దాటి ఫేమ్ రుక్మిణి వ‌సంత్ తెలుగులో ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాజావారు రాణిగారు ఫేమ్ ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో విజ‌య్‌కి జోడీగా రుక్మిణి వ‌సంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక‌చేసిన‌ట్లు స‌మాచారం.

స‌ప్త సాగ‌రాలు దాటి మూవీలో నాచుర‌ల్ యాక్టింగ్‌తో క‌న్న‌డతో పాటు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది రుక్మిణి వ‌సంత్‌. ఈ మూవీలో ఆమె స్క్రీన్‌ప్ర‌జెన్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేశాయి. క‌న్న‌డ మూవీలో ఆమె యాక్టింగ్ న‌చ్చి డైరెక్ట‌ర్ ర‌వికిర‌ణ్ కోలా...విజ‌య్ మూవీ కోసం ఆమెను హీరోయిన్‌గా ఎంపిక‌చేసిన‌ట్లు స‌మాచారం.

రౌడీ జ‌నార్ధ‌న్‌...

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌వికిర‌ణ్ కోలా మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తోన్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న 59వ సినిమా ఇది. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 9న ఈ మూవీని ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. రూరల్ యాక్షన్ డ్రామా గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీకి రౌడీ జ‌నార్ధ‌న్ అనే పేరును ప‌రిశీలిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

విశ్వ‌క్ సేన్ సినిమాకు రైట‌ర్‌...

రాజావారు రాణిగారు మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ర‌వికిర‌ణ్ కోలా. తొలి సినిమాతోనే హిట్టు అందుకున్నాడు. విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున‌క‌ళ్యాణం మూవీకి రైట‌ర్‌గా ర‌వికిర‌ణ్ కోలా వ్య‌వ‌హ‌రించాడు.

లుక్ లీక్‌...

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వీడీ 12 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించి ఇటీవ‌లే విజ‌య్ లుక్ లీకైంది. ఈ లీక్‌డ్ ఫొటోలో కొత్త లుక్‌లో విజ‌య్ క‌నిపించాడు.

స్పై యాక్ష‌న్ క‌థాంశంతోవిజ‌య్ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాల‌తో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ మూవీకి విజ‌య్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది.

ఫ్యామిలీ స్టార్‌...

గీత‌గోవిందం స‌క్సెస్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ, ప‌ర‌శురామ్ కాంబోలో వ‌చ్చిన ఫ్యామిలీస్టార్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు 50 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 20 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి డిస‌పాయింట్ చేసింది. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా విజ‌య్ మూడు సినిమాలు చేస్తోన్నాడు.

తదుపరి వ్యాసం