Shakahaari Telugu OTT: తెలుగులోకి వచ్చిన కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ -క్లైమాక్స్ ట్విస్ట్ మతిపోగొడుతుంది
Shakahaari Telugu OTT: కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శాఖాహారి తెలుగులోకి వచ్చింది. రంగాయన రఘు లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
రంగాయన రఘు లీడ్ రోల్...
శాఖాహారి మూవీలో రంగాయన రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే, వినయ్‌యూజే ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సందీప్ సుంకడ్ దర్వకత్వం వహించాడు. కన్నడంలో ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ క్రిటిక్స్‌తో పాటు మూవీ లవర్స్ ప్రశంసలను అందుకుంది. రంగాయన రఘు నటన, దర్శకుడి టేకింగ్, మేకింగ్‌తో పాటు కథలోని మలుపులు ఆడియెన్స్‌కు థ్రిల్‌ను పంచాయి. థియేటర్లలో యాభై రోజులకుపైగా ఆడింది.
శాఖాహారి కథ ఇదే!
సుబ్బన్న(రంగాయన రఘు) ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. యాభై ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. తమ్ముడు మినహా బంధువులు ఎవరూ లేని సుబ్బన్న ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. విజయ్ (వినయ్ యూజే) ఓ అనాథ. స్కాలర్‌షిప్‌తో చదువు పూర్తిచేసుకొని బీఎస్ఎఫ్‌లో జాబ్ సంపాదిస్తాడు.
అనూహ్యంగా తన భార్య సౌగంధిక మర్డర్ కేసులోవిజయ్ నిందితుడిగా మారతాడు.పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విజయ్ బుల్లెట్ గాయంతో సుబ్బన్న హోటల్‌లో తలదాచుకుంటాడు.
విజయ్ కస్టడీ నుంచి తప్పించుకోవడంతో ఎస్ఐ మల్లిఖార్జున (గోపాలకృష్ణ దేవ్‌పాండే) ఉద్యోగం చిక్కుల్లో పడుతుంది. విజయ్ కోసం అన్వేషిస్తోంటాడు. సుబ్బన్న దగ్గర ఆశ్రయం పొందుతోన్న విజయ్ అనూహ్యంగా కన్నుమూస్తాడు?
విజయ్ శవం పోలీసులకు దొరక్కుండా సుబ్బన్న ఎలా మాయం చేశాడు? సౌగంధిక హత్యకు సుబ్బన్న తమ్ముడు మదన్నకు ఉన్న సంబంధం ఏమిటి? విజయ్‌కి జరిగిన అన్యాయంపై సుబ్బన్న ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? సుబ్బన్నను సాక్ష్యాధారాలతో సహా మల్లిఖార్జున పట్టుకున్నాడా? లేదా? అన్నద ఈ మూవీ కథ.
పాటలు ఫైట్లు లేకుండా...
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా పాటలు, ఫైట్లు, కామెడీ లేకుండా రియలిస్టిక్ అంశాలతో ఈ మూవీ సాగుతుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో కేవలం ఐదారు ప్రధాన పాత్రలతోనే ఈ మూవీ సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్ చేస్తుంది.
కన్నడంలో బిజీ...
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కన్నడంలో రంగాయన రఘు పలు సినిమాలు చేస్తోన్నాడు. రంగాయన రఘు లీడ్ రోల్‌గా ఇటీవల వచ్చిన కామెడీ మూవీ మూరానే కృష్ణప్ప కూడా పెద్ద విజయాన్ని సాధించింది. 2024లో ఆరు నెలల్లోనే పదికిపైగా సినిమాలు చేశాడు రంగాయన రఘు. శివరాజ్ కుమార్ కరటక దమనక మూవీలో విలన్‌గా రంగాయన రఘు కనిపించాడు.