Singer Mangli Sandalwood Debut: హీరోయిన్‌గా క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ మంగ్లీ-singer mangli debut as heroine in sandalwood mangli acting debut ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singer Mangli Sandalwood Debut: హీరోయిన్‌గా క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ మంగ్లీ

Singer Mangli Sandalwood Debut: హీరోయిన్‌గా క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ మంగ్లీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 13, 2023 03:23 PM IST

Singer Mangli Sandalwood Debut: సింగ‌ర్ మంగ్లీ న‌టిగా క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ది. హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తోంది. ఈ క‌న్న‌డ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే...

సింగ‌ర్ మంగ్లీ
సింగ‌ర్ మంగ్లీ

Singer Mangli Sandalwood Debut: మాస్ పాట‌ల‌కు టాలీవుడ్‌లో సింగ‌ర్ మంగ్లీ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది. ధ‌మాకా, విక్రాంత్‌రోణ‌తో పాటు ఇటీవ‌ల‌కాలంలో ఆమె పాడిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించాయి. సింగ‌ర్‌గా బిజీగా ఉంటూనే తెలుగులో అడ‌పాద‌డ‌పా త‌న యాక్టింగ్ టాలెంట్‌ను చాటుకుంటోంది సింగ‌ర్ మంగ్లీ. నితిన్ మాస్ట్రో సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించింది.

తాజాగా న‌టిగా సాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది మంగ్లీ. ఓ క‌న్న‌డ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. నాగ‌శేఖ‌ర్ హీరోగా డీజే చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో పాద‌రాయ పేరుతో క‌న్న‌డ సినిమా రూపొందుతోంది. రియ‌ల్ ఇన్సిడెన్స్ ఆధారంగా సామాజిక సందేశంతో తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ది.

ప‌ల్లెటూరి అమ్మాయిగా డిఫ‌రెంట్‌గా మంగ్లీ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని చెబుతున్నారు. స‌మాజంలో మార్పు కోసం పోరాటం చేసే యువ‌తిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో మంగ్లీ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. క‌థ న‌చ్చ‌డంతో మంగ్లీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

జ‌న‌వ‌రి చివ‌రి వారంలో మంగ్లీ ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు తెలిసింది. క‌న్న‌డంతో పాటు తెలుగులో పాద‌రాయ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

క‌న్న‌డంలో సింగ‌ర్‌గా మంగ్లీ ప‌లు పాట‌లు పాడింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాట క‌న్న‌డ వెర్ష‌న్‌ను మంగ్లీ ఆల‌పించింది. ఈ పాట‌తో క‌న్న‌డ ప్రేక్ష‌కులుకు చేరువైన ఆమె తాజాగా హీరోయిన్‌గా సాండ‌ల్‌వుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ది.

Whats_app_banner