Family Star Live Updates: ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్.. విజయ్‌తో రెండు సినిమాలు క్యాన్సిల్ చేసుకున్న దిల్ రాజు!-vijay devarakonda family star review box office collection live updates audience response mrunal thakur telugu film news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Live Updates: ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్.. విజయ్‌తో రెండు సినిమాలు క్యాన్సిల్ చేసుకున్న దిల్ రాజు!

ఫ్యామిలీ స్టార్ లైవ్ అప్డేట్స్

Family Star Live Updates: ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్.. విజయ్‌తో రెండు సినిమాలు క్యాన్సిల్ చేసుకున్న దిల్ రాజు!

08:14 AM ISTApr 05, 2024 07:43 AM Sanjiv Kumar
  • Share on Facebook
08:14 AM IST

Vijay Devarakonda Family Star Live Updates: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం (ఏప్రిల్ 5)న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుందాం.

Fri, 05 Apr 202408:12 AM IST

వీడియో వైరల్

“ఫ్యామిలీ స్టార్ మేనియా ప్రారంభం అయింది. గుంటూరు ఫినిక్స్ మాల్‌లో ఫుల్ క్రౌడ్. ఇవాళ అన్ని షోలు చాలా ఫాస్ట్‌గా ఫిల్ అయిపోయాయి” అని ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. 

Fri, 05 Apr 202407:39 AM IST

గంటలో 8వేల టికెట్స్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు టాక్ ఎలా ఉన్నప్పటికీ టికెట్స్ మాత్రం బాగా అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది. గత గంటలో 8వేలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు ట్విటర్ లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. 

Fri, 05 Apr 202407:21 AM IST

చూడాల్సిన సినిమా

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఆఫ్ లైన్ లో మంచి టాక్ వస్తోంది. ప్రతి మిడిల్ క్లాస్ మనిషి చూడాల్సిన సినిమా అంటూ ఆడియెన్స్ పొగుడుతున్నారు. 

Fri, 05 Apr 202406:50 AM IST

200 కోట్ల కన్ఫర్మ్

“విజయ్ దేవరకొండ సినిమాకు ఓవర్సీస్ నుంచి బ్లాక్ బస్టర్ రివ్యూస్ వస్తున్నాయి. రూ. 200 కోట్లు కన్ఫర్మ్” అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో గతంలో (ట్విట్టర్) పోస్ట్ చేశాడు. దానిపై ట్రోలింగ్ జరుగుతోంది 

Fri, 05 Apr 202406:34 AM IST

రెండు సినిమాలు క్యాన్సిల్

ఫ్యామిలీ స్టార్ సినిమా ఎఫెక్ట్‌తో విజయ్ తో చేయాల్సిన రెండు సినిమాలను నిర్మాత దిల్ రాజు క్యాన్సిల్ చేసుకున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. 

Fri, 05 Apr 202406:13 AM IST

నాగ చైతన్య, అల్లు అరవింద్ రియాక్షన్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాపై వస్తున్న రెస్పాన్స్, రివ్యూస్ చూసి హీరో నాగ చైతన్య, నిర్మాత అల్లు అరవింద్ రియాక్షన్ ఇదేనంటూ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

Fri, 05 Apr 202405:51 AM IST

మహేష్ బాబును లాగుతూ!

విజయ్ దేవరకొండకు నైజాం ఏరియాలో షాక్ తగిలింది.  నైజాం డిస్ట్రిక్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమాకు మార్నింగ్ షోలో 50 శాతం వరకు ప్రేక్షకులు లేరని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండను ప్రిన్స్, నిజామ్ నవాబ్ అని బాగా రుద్దుతారు కదా అంటూ కౌంటర్ గా పోస్ట్ చేశాడు.  

Fri, 05 Apr 202405:35 AM IST

మొదటి ప్లాఫ్

సీత రామం, హాయ్ నాన్న సినిమాలతో మంచి హిట్ కొట్టింది బాలీవుడ్ బ్యూటి మృణాల్ ఠాకూర్. అయితే, ఈసారి ఫ్యామిలీ స్టార్ సినిమాతో మాత్రం మొదటి ప్లాఫ్ అందుకుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే ఐరన్ మ్యాన్ విజయ్ అంటూ వీడియోలకు క్యాప్షన్ ఇస్తున్నారు. 

Fri, 05 Apr 202405:12 AM IST

కొండన్న తప్పు చేశాడు

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొంతమంది బాగుంది, విజయ్ స్టోరీ సెలక్షన్ బాగుంది అంటే.. మరికొందరు చాలా బోరింగ్‌గా ఉందని, కొండన్న తప్పు చేశాడని అంటున్నారు. ఫస్టాఫ్ చాలా బోరింగ్ గా ఉందని లేడి ఆడియెన్స్ చెబుతున్నారు. 400 కోట్ల నుంచి స్టార్ట్ చేద్దాం అని లైగర్ సమయంలో విజయ్ వాడిన డైలాగ్స్ తో సెటైర్లు సైతం వేస్తున్నారు.

Fri, 05 Apr 202404:54 AM IST

అజిత్ వీడియోతో ట్రోలింగ్

ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తోంది. దాంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్సిడెంట్ వీడియోను పోస్ట్ చేసి.. లైగర్, ఖుషీతోపాటు ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అన్నట్లుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. 

Fri, 05 Apr 202404:42 AM IST

టీవీ సీరియల్‌లా

ఫ్యామిలీ స్టార్‌కు నెగెటివ్ టాక్ కూడా ఎక్కువ‌గా వస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ స్టోరీ సెలెక్ష‌న్ పూర్ అని మ‌రోసారి ఫ్యామిలీ స్టార్‌తో రుజువైంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. రొటీన్ టెంప్లేట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇద‌ని, రియ‌ల్ ఎమోష‌న‌ల్ క‌నెక్షన్స్‌, ఫీల్‌గుడ్ మూవ్‌మెంట్స్ ఈ సినిమాలో మిస్స‌య్యాయ‌ని చెబుతున్నారు. అంతేకాకుండా టీవీ సీరియల్‌లా ఉందంటున్నారు. 

Fri, 05 Apr 202404:26 AM IST

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎన‌భై ఫీట్ల క‌టౌట్‌.. ఎక్క‌డంటే?

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వ‌ద్ద విజ‌య్ దేవ‌ర‌కొండ ఎన‌భై ఫీట్ల క‌టౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ క‌టౌట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

Fri, 05 Apr 202402:05 AM IST

ఫ్యామిలీ స్టార్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ అంచ‌నా...

ఫ్యామిలీ స్టార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవ‌ర్‌సీస్‌లో కోటి, తెలుగు రాష్ట్రాల్లో కోటిన్న‌ర వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అడ్వాన్స్ బుకింగ్స్ క‌లుపుకొని తొలిరోజు ఈ మూవీ ప‌దికోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

Fri, 05 Apr 202401:41 AM IST

కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ

ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజ‌య్ దేవరకొండ మరోసారి త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టేశాడ‌ని ఓ నెటిజ‌న్ తెలిపాడు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టే కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ ఇద‌ని, మాస్ క‌మ‌ర్షియ‌ల్ మైండ్‌సెట్‌తో థియేట‌ర్‌కు వెళితే ఎంజాయ్ చేయ‌లేర‌ని అంటున్నారు. 

Fri, 05 Apr 202401:39 AM IST

ఓవర్సీస్ టాక్

ఏప్రిల్ 5న ఇండియాలో ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకు రెడీ ఉండగా.. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడ చూసిన సినీ ప్రేక్షకులు ఫ్యామిలీ స్టార్ మూవీపై రివ్యూలు ఇస్తున్నారు. 

Fri, 05 Apr 202401:38 AM IST

ట్రోలింగ్ బారిన

ఫ్యామిలీ స్టార్ సినిమాకు గోపీ సుందరం మ్యూజిక్ అందించారు. సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కల్యాణి వచ్చా వచ్చా అనే పాట మాత్రం కాస్తా ట్రోలింగ్ బారిన పడింది. 

Fri, 05 Apr 202401:38 AM IST

రెండోసారి

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఫ్యామిలీ స్టార్ కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. 

Fri, 05 Apr 202401:37 AM IST

గీత గోవిందం

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో ఇదివరకు గీతగోవిందం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

Fri, 05 Apr 202401:34 AM IST

ఫ్యామిలీ స్టార్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం, హాయ్ నాన్న సినిమాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ స్టార్ సినిమాకు నిర్మాతగా వ్యవహిరంచారు.