తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr Fans Ruckus In London: లండన్ థియేటర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. స్మోక్ బాంబ్ పేల్చిన అభిమానులు

NTR fans Ruckus in London: లండన్ థియేటర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. స్మోక్ బాంబ్ పేల్చిన అభిమానులు

20 May 2023, 22:35 IST

    • NTR fans Ruckus in London: లండన్‌లోని ఓ థియేటర్‌లో అభిమానుల చేసిన రచ్చ పెద్ద వివాదంగా మారింది. సింహాద్రి రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు స్మోక్ బాంబులు పేల్చడంతో ఫైర్ అలారం మోగింది. ఫలితంగా హడావిడి నెలకొంది.
సింహాద్రి రి రిలీజ్
సింహాద్రి రి రిలీజ్

సింహాద్రి రి రిలీజ్

NTR fans Ruckus in London: కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం శృతి మించుతుంది. ముఖ్యంగా మనదేశంలో థియేటర్లలో ఫ్యాన్స్ హడావిడి వల్ల ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక్కడంటే ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు కానీ.. విదేశాల్లో అయితే తప్పకుండా కఠిన చర్యలుంటాయి. ఇటీవల అమెరికాలో జైబాలయ్య అంటూ స్లోగన్‌లు చేస్తూ హడావిడి చేసినందుకు ఓ సినిమా థియేటర్ యాజమాన్యం ఏకంగా ఆ షోనే రద్దు చేసింది. తాజాగా యూకేలో కూడా అభిమానులు అత్యుత్సాహం వల్ల అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

వివరాల్లోకి వెళ్తే.. సింహాద్రి రీ రిలీజ్ సందర్భంగా లండన్‌లోని ఓ థియేటర్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హాల్లో స్మోక్ బాంబ్‌ను పేల్చారు. ఫలితంగా థియేటర్ ఆవరణ మొత్తం పొగతో నిండిపోయింది. చాలా మంది ప్రేక్షకులు సినిమా కారిడార్ల వెంబడి కేరింతలు కొడుతూ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. కొంతమంది అభిమానులు థియేటర్ లోపల టపాకాయలు కాల్చడంతో మంటతో పాటు పొగ కూడా విపరీతంగా వ్యాపించింది.

దీంతో లండన్ ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. అయితే అక్కడ ఎలాంటి మంట లేదని, నిప్పు మాత్రమే ఉందని లండన్ ఫైర్ బ్రిగేడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్మోక్ డివైజ్‌ను పెట్టడం వల్ల అలారం మొగిందని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ముందుగా సినిమాహాల్‌ను ఖాలీ చేయించామని, రాత్రి 10.13 గంటలకు సహాయం కోసం పిలవగా 10.39 గంటలకు సంఘటన ముగిసిందని తెలిపారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల అత్యుత్సాహం ప్యానిక్ సిచ్యూవేషన్లు క్రియేట్ కావడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో జల్సా, దేశముదురు రీ రిలీజ్ స్క్రినింగీ సమయంలో అభిమానులు సినిమా హాల్ ఆస్తి నాశనం కావడానికి కారణమయ్యారు. ఫలితంగా థియేటర్ ఓనర్లు కొన్ని రోజుల పాటు రిరీలిజులను బ్యాన్స్ చేశారు. తాజాగా సింహాద్రి స్క్రీనింగ్ సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.