తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr Trp Rating Rajamouli Film Fails To Attract Tv Audience

RRR Trp Rating: బుల్లితెర‌పై రాజ‌మౌళికి షాక్ – టీఆర్‌పీ రేటింగ్స్ టాప్ టెన్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కు దక్కనిచోటు

HT Telugu Desk HT Telugu

25 August 2022, 13:22 IST

  • ఎన్టీఆర్‌(Ntr), రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan)హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్(RRR). 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి చ‌రిత్ర‌ను సృష్టించింది. ఇటీవ‌లే ఈ సినిమా బుల్లితెర‌పై సంద‌డి చేసింది. ఈ తొలి టీవీ ప్రీమియ‌ర్‌కు వ‌చ్చిన టీఆర్‌పీ రేటింగ్స్ ఎంతంటే...

ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్
ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్ (Twitter)

ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్

RRR Trp Rating: థియేట‌ర్ల‌లో అద్వితీయ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ బుల్లితెర‌పై మాత్రం నిరాశ‌ప‌రిచింది. లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ తో రాజ‌మౌళికి బుల్లితెర ప్రేక్ష‌కులు పెద్ద షాక్ ఇచ్చారు. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్ తో పాటు రాజ‌మౌళి టేకింగ్‌, వీరోచిత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా దాదాపు 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Ramam Raghavam: దర్శకుడిగా జబర్తస్త్ కమెడియన్ ధన్‌రాజ్ ద్విభాషా చిత్రం.. తమిళ హీరో కామెంట్స్

Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో నిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు హాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల ఈ సినిమా స్టార్ మా టెలికాస్ట్ అయ్యింది. టీవీ ప్రీమియ‌ర్ ఇదే తొలిసారి కావ‌డంతో భారీగా టీఆర్‌పీ రేటింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ ఈ సినిమా 19.62 టీఆర్‌పీ రేటింగ్ పాయింట్స్ మాత్ర‌మే సొంతం చేసుకున్న‌ది.

ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో అల వైకుంఠ‌పుర‌ములో 29.4 టీఆర్‌పీ రేటింగ్స్ తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో స‌రిలేరు నీకెవ్వ‌రు, బాహుబ‌లి, శ్రీమంతుడు, పుష్ప ఉన్నాయి. టాప్ టెన్ లో ఆర్ఆర్ఆర్ కు చోటు ద‌క్క‌లేదు. ఫిదా, గీతాగోవిందం కంటే ఆర్ఆర్ఆర్ కు త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్స్ రావ‌డం గ‌మ‌నార్హం. తొలి టీవీ ప్రీమియ‌ర్ కు త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్స్ రావ‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.