Prabhas Next Movie Title : ప్రభాస్-సంజయ్ దత్ సినిమా పేరు ఫిక్స్.. 'రాయల్'గా రానున్న డార్లింగ్!
18 June 2023, 6:50 IST
- Prabhas Royal Movie : ఆదిపురుష్ సినిమా విడుదల తర్వాత ప్రభాస్ గురించి మరో వార్త వైరల్‌గా మారింది. ప్రభాస్, సంజయ్ దత్ నటిస్తున్న చిత్రం పేరు ఫిక్స్ చేసినట్టుగా వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా థియేటర్లలో ఉంది. ఆదిపురుష్ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తోంది. ఈ చిత్రం సోషల్ మీడియా(Social Media)లో ట్రోల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించిన మరో వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ రాయల్‌గా మారడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు.
ప్రభాస్, సంజయ్ దత్(Prabhas-Sanjay Dutt) కలిసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త తెలిసిందే. ఈ చిత్రానికి మారుతి డెరెక్టర్. కొన్నిరోజులుగా ఈ సినిమా గురించి పెద్దగా అప్‌డేట్ రాలేదు. ప్రభాస్ ఆదిపురుష్(Prabhas Adipurush) సినిమాతో బిజీగా ఉండడంతో కొత్త సినిమా గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇప్పుడు సంజయ్ దత్, ప్రభాస్ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది హారర్ కామెడీ సినిమా. ఈ చిత్రానికి ‘రాయల్’(Royal) అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం వరకూ ఆదిపురుష్ ప్రమోషన్‌లో ప్రభాస్ బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ జరగలేదు. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు పేర్లు ఆలోచించారట. రాజా డీలక్స్(Raja Deluxe), అంబాసిడర్, రాయల్ అనే మూడు పేర్లపై చర్చలు జరిగాయి. అయితే దర్శకుడు రాయల్ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
ప్రభాస్-మారుతి సినిమా 50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. సంజయ్ దత్ ఆత్మ ప్రభాస్ శరీరంలోకి ప్రవేశించి, తర్వాత ఏం జరుగుతుందనేది సినిమా కథగా అంటున్నారు.
సంజయ్ దత్, ప్రభాస్ సినిమా గురించి చిత్ర బృందం ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఈ సినిమా టైటిల్‌ను మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ప్రభాస్ ప్రస్తుతం సాలార్(Salaar) సినిమాతోనూ బాగా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. ఇందులో శృతి హాసన్(Shruti Haasan) కథానాయికగా నటిస్తోంది. మరోవైపు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే(Project K) సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇంకోవైపు విజయ్ నటిస్తున్న లియో సినిమాలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు.