తెలుగు న్యూస్ / ఫోటో /
Adipurush Memes : ఆదిపురుష్ సినిమాపై ఘోరమైన మీమ్స్.. ఇదిగో చూసేయండి
ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం శుక్రవారం (జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య సినిమా విడుదలైంది. అయితే ఈ చిత్రంపై ట్రోల్స్ మాత్రం దారుణంగా వస్తున్నాయి.
(1 / 10)
ఆదిపురుష్ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. గతేడాది తొలిసారిగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. టీజర్‌లో ఆదిపురుష పాత్రలను మోడ్రన్ క్యారెక్టర్‌లుగా చూపించడం చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత తప్పును సరిదిద్దుకుంటామని చిత్ర బృందం తెలిపింది.
(2 / 10)
జూన్ 16న థియేటర్లలో సినిమా చూసిన చాలా మందికి బోర్ కొట్టింది. గ్రాఫిక్స్ కోసం రూ.500 కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఏముంది? అంతా బాగానే ఉంది అనుకుని సినిమా చూడ్డానికి వచ్చామని ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ పాత్రలను ఫన్నీగా చూపించారని దర్శకుడు ఓం రావత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడియెన్స్.
(3 / 10)
సినిమాలో పాత్రలను వింతగా చూపించి రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో నటుడు ప్రభాస్‌ను జీసస్ క్రైస్ట్‌లాగా చూపించారని అభిమానులు అంటున్నారు.
(4 / 10)
రామాయణంలో కూడా దర్శకుడు హాట్‌నెస్‌ని ప్రదర్శించాడని విమర్శలు వస్తున్నాయి. సీతామాతను అవమానించారని ఆరోపణలు వస్తున్నాయి.
(6 / 10)
ఆదిపురుష్ సినిమాలోని రామ, రావణ పాత్రలను హాలీవుడ్ అవెంజర్స్, థోర్ రాగ్నరోక్ చిత్రాలతో పోల్చి మీమ్స్ క్రియేట్ చేశారు.
(7 / 10)
రామాయణంలోని మరో పాత్ర ఇంద్రజితుని ఆదిపురుష్ లో చూపించిన విధానం నవ్వు తెప్పిస్తుంది. ఇంద్రజితుడా లేక టాటూ ఆర్టిస్టునా? అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
(8 / 10)
రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ చుట్టూ పాములు ఉండటాన్ని చూసి తెగ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రామాయణ కాలంలో పాములతో స్పా చేయించుకునేవారా అని అడుగుతున్నారు.
(9 / 10)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఆదిపురుష్ సినిమాలోని వానరంతో పోలుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ను షేర్ చేశాడు ఓ వ్యక్తి. ఇది చూసిన థానే నగర పోలీసులు.. మీ కాంటాక్ట్ నంబర్‌ను మాకు ఇవ్వండి అని రీ ట్వీట్ చేశారు.
ఇతర గ్యాలరీలు