తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shakini Dakini Ott Release Date: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి శాకిని డాకిని

Shakini Dakini OTT Release Date: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి శాకిని డాకిని

29 September 2022, 14:21 IST

  • Shakini Dakini OTT Release Date: శాకిని డాకిని సినిమా ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. రెజీనా, నివేథా థామ‌స్ న‌టించిన ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

రెజీనా,నివేథా థామ‌స్
రెజీనా,నివేథా థామ‌స్ (Twitter)

రెజీనా,నివేథా థామ‌స్

Shakini Dakini OTT Release Date: రెజీనా(Regina) , నివేథా థామ‌స్(Nivetha Thomas) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన శాకిని డాకిని సినిమా సెప్టెంబ‌ర్ 16న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కొరియ‌న్ చిత్రం మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ ఆధారంగా ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్ద‌ర‌మ్మాయిలు ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నార‌నే క‌థాంశంతో కామెడీ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డంతో పాటు థ్రిల్‌ను పంచ‌డంలో విఫ‌ల‌మైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌దిహేను రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. సెప్టెంబ‌ర్ 30 (రేపు)నుంచి శాకిని డాకిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం రోజు ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఓటీటీ కోస‌మే ఈ సినిమాను రూపొందించిన‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత ఆలోచ‌న‌ను మార్చుకున్న నిర్మాతలు థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసిన‌ట్లు తెలిసింది. రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాత‌లు ఓటీటీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు చెబుతున్నారు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్‌తో క‌లిసి సునీత తాటి ఈ సినిమాను నిర్మించింది. వ‌కీల్ సాబ్ త‌ర్వాత నివేథా థామ‌స్ న‌టించిన సినిమా ఇది. రెజీనా కూడా చాలా రోజుల త‌ర్వాత తెలుగులో చేసిన సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.