తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmi Gautam Bigboss: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ర‌ష్మి - రెమ్యున‌రేష‌న్ భారీగానే డిమాండ్‌?

Rashmi Gautam Bigboss: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ర‌ష్మి - రెమ్యున‌రేష‌న్ భారీగానే డిమాండ్‌?

09 February 2023, 12:44 IST

  • Rashmi Gautam Bigboss: జ‌బ‌ర్ధ‌స్థ్ యాంక‌ర్ ర‌ష్మి బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ షోలో పాల్గ‌న‌డానికి ఆమె భారీగానే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

యాంక‌ర్ ర‌ష్మి
యాంక‌ర్ ర‌ష్మి

యాంక‌ర్ ర‌ష్మి

Rashmi Gautam Bigboss: బిగ్‌బాస్‌లోకి జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ర‌ష్మి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లుగా చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవ‌కాశాలు త‌న‌కు వ‌చ్చిన‌ట్లు ర‌ష్మి చెప్పింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించిన ర‌ష్మి ఈ సారి మాత్రం ఒకే చెప్పిన‌ట్లు స‌మాచారం. బిగ్‌బాస్ సీజ‌న్ 7లో ఆమె కంటెస్టెంట్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

ఇందుకోసం ర‌ష్మి వారానికి ఏడు నుంచి ఎనిమిది ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ లెక్క‌న ఫ‌స్ట్ వీక్ నుంచి ఫైన‌ల్ వ‌ర‌కు ప‌దిహేను వారాల‌కు క‌లిపి ఆమెకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ ముట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు బుల్లితెర వ‌ర్గాలు చెబుతున్నాయి.

గ‌తంలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది టీవీ సెల‌బ్రిటీల‌కు వారానికి రెండు నుంచి మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు బిగ్‌బాస్ నిర్వ‌హ‌కులు రెమ్యున‌రేష‌న్‌ చెల్లించారు.

వారితో పోలిస్తే ర‌ష్మి డ‌బుల్ రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే బుల్లితెర‌పై ర‌ష్మికున్న క్రేజ్ దృష్ట్యా ఆమె కోరినంత మొత్తం ఇవ్వ‌డానికి బిగ్‌బాస్ మేక‌ర్స్ సిద్ధ‌ప‌డిన‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ర‌ష్మి బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే ముగిసిన బిగ్‌బాస్ సీజ‌న్ 6లో సింగ‌ర్ రేవంత్ విజేత‌గా నిలిచాడు. ఇందులో చాలా వ‌ర‌కు జ‌నాల‌కు తెలియ‌ని అంత‌గా పాపులారిటీ లేని కంటెస్టెంట్స్ పాల్గొన‌డంతో టీఆర్‌పీ రేటింగ్ త‌క్కువ‌గానే వ‌చ్చింది. అనుక‌న్నంత‌గా సీజ‌న్ 6 స‌క్సెస్ కాక‌పోవ‌డంతో సీజ‌న్ 7 విష‌యంలో మేక‌ర్స్ చాలా మార్పులు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారంజ‌రుగుతోంది. హోస్ట్‌గా నాగార్జున స్థానంలో మ‌రో స్టార్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.