తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramya Krishnan Entry In Ott: డాన్స్ ఐకాన్ షోతో ఓటీటీలోకి రాజమాత ఎంట్రీ.. జడ్జిగా రమ్యకృష్ణ అరంగేట్రం

Ramya Krishnan Entry in OTT: డాన్స్ ఐకాన్ షోతో ఓటీటీలోకి రాజమాత ఎంట్రీ.. జడ్జిగా రమ్యకృష్ణ అరంగేట్రం

13 September 2022, 10:45 IST

    • Ramya Krishnan in Aha Show: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో రమ్య కృష్ణన్ జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబరు 11న లాంచ్ అయిన ఈ కార్యక్రమం సెప్టెంబరు 17 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
రమ్య కృష్ణ
రమ్య కృష్ణ (HT)

రమ్య కృష్ణ

Ramya Krishnan Entry in OTT Show: ఆహా ఎప్పుడు కూడా విన్నూత్నంగా ఉండే కథలని, షోస్ ప్రేత్రకుల ముందుకు తీసుకురావాలని తపనపడుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ సక్సెస్ తర్వాత మరోసారి నాన్-ఫిక్షన్‌లో తన సత్తాచాటుకోవడానికి డాన్స్ ఐకాన్‌తో సిద్ధంగా ఉంది. ఇప్పటికే షో మేకర్స్ ఎంతో మంది సెలబ్రిటీస్‌ను ఈ షో బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానించారు. ఇప్పుడు అందరిని ఉర్రూతలూగించడానికి లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ ను జడ్జ్‌గా పరిచయం చేయబోతున్నారు. ఈ షో ద్వారా రమ్య కృష్ణన్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో జడ్జ్‌గా అడుగుపెడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ఈ షో ద్వారా జడ్జి గా ఓ టి టి లో రమ్య కృష్ణన్ అరంగేట్రం చేయబోతున్నారు. వారితో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ డిజిటల్ స్పేస్‌లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా పరిచయం అయ్యారు. టెలివిజన్ టాప్ యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఈ షో తో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లో అడుగుపెట్టారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న ప్రీమియర్ ఆహలో ప్రీమియర్ అయింది. అలాగే సెప్టెంబర్ 17 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

ఓ టి టి లో న్యాయనిర్ణేతగా తన అరంగేట్రం గురించి రమ్య కృష్ణన్ మాట్లాడుతూ, "డ్యాన్స్ ఐకాన్ షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయలేదు. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఓ కొత్త రమ్యను అందరు చూడబోతున్నారు. ఈ షో ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను."

ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ, “డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్ కు జడ్జి గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది."అని తెలిపారు.

షో యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ.. "“రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ, ఓక్ టీం ద్వారా సాకరమవడం సంతోషంగా ఉంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది.”అని స్పష్టం చేశారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.