తెలుగు న్యూస్  /  Entertainment  /  Ramcharan Starts New Production House With Friend Vikram

Ram Charan: మ‌రో ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్టార్ట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్ - న్యూ టాలెంట్‌కు మాత్ర‌మే ఛాన్స్

HT Telugu Desk HT Telugu

25 May 2023, 12:24 IST

  • Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా కొత్త వాళ్ల‌తో పాన్ ఇండియ‌న్ సినిమాల్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

రామ్‌చ‌ర‌ణ్

Ram Charan: మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను స్టార్ట్ చేశాడు. త‌న స్నేహితుడు విక్ర‌మ్‌తో క‌లిసి వీ మెగా పిక్చ‌ర్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను మొద‌లుపెట్టాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా టాలీవుడ్‌లోని న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌ను నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాన్ ఇండియ‌న్ సినిమాల్ని తెర‌కెక్కిస్తామ‌ని వెల్ల‌డించారు.

2017లోనే కొణిడెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ బ్యాన‌ర్ ద్వారా ఖైదీ నంబ‌ర్ 150తో పాటు సైరా న‌ర‌సింహారెడ్డి, ఆచార్య‌, గాఢ్‌ఫాద‌ర్ (GodFather) సినిమాల్నితెర‌కెక్కించాడు. విక్ర‌మ్ కూడా యూవీ క్రియేష‌న్స్ ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఓన్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లు ఉండ‌గానే వీరిద్ద‌రు క‌లిసి సొంతంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపించ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

త్వ‌ర‌లోనే వీ మెగా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఓ పాన్ ఇండియ‌న్ సినిమాను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజ‌ర్ మూవీతో బిజీగా ఉన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ సినిమా షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్‌లో జూన్ సెకండ్ వీక్ నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు తెలిసింది. గేమ్‌ఛేంజ‌ర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్‌జే సూర్య, న‌వీన్‌చంద్ర‌, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు.

శంక‌ర్ సినిమాతో పాటుగా బుచ్చిబాబు సానా( Buchi Babu Sana)ద‌ర్శ‌క‌త్వంలో రూర‌ల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేస్తోన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. రామ్‌చ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. హాలీవుడ్ నుంచి అత‌డికి అవ‌కాశాలు వ‌చ్చాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.