Ram Sita Ram song lyrics: ఆదిపురుష్ రామ్ సీతా రామ్ సాంగ్ లిరిక్స్ ఇవే
09 June 2023, 14:54 IST
- Ram Sita Ram song lyrics: ఆదిపురుష్ రామ్ సీతా రామ్ సాంగ్ లిరిక్స్ ఇవే. జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆదిపురుష్ సినిమా
Ram Sita Ram song lyrics: ఆదిపురుష్ మూవీ నుంచి ఈ మధ్యే రామ్ సీతా రామ్ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. మనసుకు హత్తుకునే మ్యూజిక్, అందుకు తగిన లిరిక్స్ తో ఈ పాట అభిమానులను అలరిస్తోంది. సచేత్-పరంపర జోడీతోపాటు కార్తీక్ ఈ పాట పాడారు.
రామ్ సీతా రామ్ సాంగ్ లిరిక్స్
హో ఆదియు అంతము రామునిలోనే
మా అనుబంధము రామునితోనే
ఆప్తుడు బంధువు అన్నియు తానే
అలకలు పలుకులు ఆతనితోనే
సీతా రాముల పున్నమిలోనే
నిరతము మా ఎద వెన్నెలలోనే
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
దశరథాత్మజుని పదముల చెంత
కుదుటపడిన మది ఎరుగదు చింత
రామనామమను రత్నమె చాలు
గళమున దాల్చిన కలుగు శుభాలు
మంగళప్రదము శ్రీరాముని పయనము
ధర్మ ప్రమాణము రామాయణము
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్