Na Roja Nuvve Song lyrics: నా రోజా నువ్వే.. ఖుషీ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే.. మీరూ హమ్ చేయండి-na roja nuvve song lyrics from the movie kushi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Na Roja Nuvve Song Lyrics From The Movie Kushi

Na Roja Nuvve Song lyrics: నా రోజా నువ్వే.. ఖుషీ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే.. మీరూ హమ్ చేయండి

Hari Prasad S HT Telugu
May 09, 2023 05:21 PM IST

Na Roja Nuvve Song lyrics: నా రోజా నువ్వే అంటూ ఖుషీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే. ఈ లిరిక్స్ చూసి మీరూ ఈ పాటను హమ్ చేయొచ్చు. విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఖుషీలో నటించిన విషయం తెలిసిందే.

ఖుషీ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత
ఖుషీ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత

Na Roja Nuvve Song lyrics: విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ మూవీ నుంచి మంగళవారం (మే 9) ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే వచ్చిన విషయం తెలుసు కదా. విజయ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ ను ఈ లిరికల్ సాంగ్ తో సర్‌ప్రైజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. ఇందులో విజయ్, సామ్ జోడీ కూడా అభిమానులను ఆకర్షించేలా ఉంది.

పూర్తిగా డైరెక్టర్ మణిరత్నం సినిమా టైటిల్స్ తో ఈ పాట లిరిక్స్ రాయడం విశేషం. మరి ఈ పాటను మీరు కూడా పాడాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇక్కడ నా రోజా నువ్వే సాంగ్ పూర్తి లిరిక్స్ ఇస్తున్నాం. ఆ లిరిక్స్ చూస్తూ మీరూ హమ్ చేయండి.

నా రోజా నువ్వే లిరిక్స్

ఆరా...

ఆరా...

ఆరా...

తననననా

తననననా

తనననా

పల్లవి:

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

దిల్ మాంగే మోరూ..

ఈ ప్రేమే వేరూ..

హుక్‌లైన్ 1

నా రోజా నువ్వే...

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

చరణం 1:

నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంట..

ఓకే బంగారం..

హుక్‌లైన్ 2:

నా రోజా నువ్వే...

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

చరణం 2:

నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా..

నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా..

నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో..

నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై..

నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంట..

ఓకే నా బేగం..

పల్లవి రిపీట్:

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..

హుక్‌లైన్ 3:

నా రోజా నువ్వే...

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

IPL_Entry_Point

సంబంధిత కథనం