Adipurush Ram Sita Ram Song: ఆదిపురుష్ రామ్ సీతారామ్ సాంగ్ రిలీజ్ - విజువ‌ల్‌ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్‌-prabhas adipurush movie ram sita ram song unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Adipurush Movie Ram Sita Ram Song Unveiled

Adipurush Ram Sita Ram Song: ఆదిపురుష్ రామ్ సీతారామ్ సాంగ్ రిలీజ్ - విజువ‌ల్‌ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్‌

HT Telugu Desk HT Telugu
May 29, 2023 01:16 PM IST

Adipurush Ram Sita Ram Song: ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీ నుంచి రామ్ సీతారామ్ ఫుల్ సాంగ్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌
ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌

Adipurush Ram Sita Ram Song: ఆదిపురుష్ నుంచి ఒక్కో అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై ఉన్న‌ అంచ‌నాల్ని రెట్టింపు చేస్తోంది మూవీ యూనిట్‌. సోమ‌వారం రామ్ సీతారామ్ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సీతారాముల అనురాగాన్ని చాటిచెబుతూ మెలోడీ ప్ర‌ధానంగా సాగిన ఈ పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. పాట ఆరంభంలో నువ్వు రాజ‌కుమారికి జాన‌కి.

నువ్వు ఉండాల్సింది రాజ‌భ‌వ‌నంలో అని రాముడు అన‌గా...నా రాఘ‌వ ఎక్క‌డుంటే అదే నా రాజ‌భ‌వ‌నం. మీ నీడైన మిమ్మ‌ల్ని వ‌దిలివెళుతుందేమో కానీ ఈ జాన‌కి వెళ్ల‌దు అంటూ రాముడిపై త‌న‌కున్న ప్రేమ‌ను సీత‌చాటుకునే డైలాగ్‌తో ఈ పాట ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది.

ఆది అంతము రామునిలోనే..మా అనుబంధ‌ము రామునితోనే అనే ప‌ల్ల‌వితో సాగిన ఈ సాంగ్‌ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

కార్తిక్‌, స‌చేత్ టాండ‌న్‌, ప‌రంప‌ర టాండ‌న్... రామ్ సీతారామ్ గీతాన్ని ఆల‌పించారు. స‌చేత్ - ప‌రంప‌ర సంగీతాన్ని అందించారు. రామ్ సీతారామ్ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. గంట‌లోనే వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. రామాయ‌ణ గాథ ఆధారంగా ఆదిపురుష్ సినిమాను ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కిస్తోన్నారు.

దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఇందులో రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తోండ‌గా..జాన‌కి పాత్ర‌ను కృతిస‌న‌న్ పోషిస్తోంది. రావ‌ణాసుర‌డిగా సైల్ అలీఖాన్ న‌టిస్తోన్నాడు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో ఈ మూవీని రూపొందించారు.

త్రీడీతో పాటు ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ మూవీని త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

IPL_Entry_Point