Ram Charan: ఆస్కార్ విన్నర్‌కు ఇచ్చిన మాట నెరవేర్చుకోనున్న రామ్‌చరణ్ - కడప దర్గా ఉత్సవాలకు మెగాపవర్‌స్టార్
18 November 2024, 14:39 IST
Ram Charan: ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి కడప దర్గా ఉరుసు ఉత్సవాల్లో రామ్ చరణ్ పాల్గొనున్నాడుజ సోమవారం (నేడు) జరుగనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ హాజరుకానున్నాడు.
రామ్ చరణ్
Ram Charan: ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్. అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ పాన్ ఇండియన్ మూవీని దిల్‌రాజు ప్రొడ్యూస్ చేశాడు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త మూవీ షూటింగ్‌ను ఈనెలలోనే మొదలుపెట్టబోతున్నాడు రామ్ చరణ్.
కడప ఉరుసు ఉత్సవాల్లో...
ఈ బిజీ షెడ్యూల్స్‌లో రామ్‌చరణ్ స్పెషల్ ఫ్లైట్‌లో సోమవారం సాయంత్రం కడప వెళ్లనున్నారు. కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో రామ్‌చరణ్ పాల్గొననున్నాడు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా సోమవారం 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు రామ్‌చరణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు.
రెహమాన్‌కు మాట ఇచ్చిన చరణ్...
ముషాయిరా గజల్ ఈవెంట్‌కు హాజరవుతానని ఆస్కార్ విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు రామ్‌చరణ్ మాటిచ్చారట. రెహమాన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడే చరణ్ కడప దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు చెబుతోన్నారు. అయ్యప్ప మాలలో ఉండి కూడా రామ్‌చరణ్ ఈ ఉత్సవాలకు హాజరుకాబోతుండటం గమనార్హం. రాత్రి తొమ్మిది గంటలకు జరుగనున్న దర్గా ప్రత్యేక ప్రార్ధనల్లో రామ్ చరణ్ పాల్గొననున్నట్లు సమాచారం.
రెహమాన్ మ్యూజిక్...
ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీతోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.
మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్...
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 16వ మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 నుంచి మొదలుకాబోతున్నట్లు సమాచారం. మైసూర్‌లో జరుగనున్న ఫస్ట్ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, హీరోయిన్ జాన్వీకపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది.
రొమాంటిక్ డ్యూయెట్...
గేమ్ ఛేంజర్ నుంచి కొత్త పాటను ఈ నెల 20న రిలీజ్ చేయబోతున్నారు. రామ్‌చరణ్, కియారా అద్వానీలపై రొమాంటిక్ డ్యూయెట్‌గా డైరెక్టర్ శంకర్ ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎస్‌జేసూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల లక్నోలో రిలీజ్ చేశారు.
టాపిక్