Game Changer OTT Rights: 110 కోట్లకు అమ్ముడు పోయిన రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే
Game Changer OTT Rights: రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్‌ను రికార్డ్ ధరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకున్నట్లు సమాచారం. సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ 110 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతోన్నారు. ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
Game Changer OTT Rights రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓటీటీ హక్కులను 110 పది కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసమే అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు చెబుతోన్నారు.
హిందీ డిజిటల్ రైట్స్‌ను మరో ఓటీటీ సంస్థకు అమ్మేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేకర్స్‌కు 150 కోట్ల రూపాయల వరకు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు రెండు నెలల ముందే గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
శంకర్ సినిమాల స్టైల్‌లోనే...
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. శంకర్ సినిమాల స్టైల్‌లోనే సామాజిక సందేశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభుత్వ అధికారిగా, అన్యాయంపై పోరాటం చేసే యువకుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో రామ్‌చరణ్ కనిపించనున్నట్లు సమాచారం.
సంక్రాంతికి రిలీజ్...
గేమ్ ఛేంజర్‌లో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, నవీన్‌చంద్ర, అంజలి, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతోంది. తొలుత ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు. గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంభర వెనక్కివెళ్లిపోయింది. కొడుకు మూవీ కోసం తన సినిమాను చిరంజీవి వాయిదావేసుకున్నారు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్...
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రారా మచ్చాతో పాటు మరో సాంగ్‌ను రిలీజ్‌చేశారు.
టాలీవుడ్ ఎంట్రీ...
వినయవిధేయ రామ తర్వాత గేమ్‌ఛేంజర్‌లో సెకండ్ టైమ్ జోడీగా కనిపించబోతున్నారు రామ్‌చరణ్, కియారా అద్వానీ. ఈ సినిమాతోనే శంకర్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. శంకర్ గత సినిమా ఇండియన్ 2 డిజాస్టర్‌గా నిలవడంతో గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.
రా అండ్ రస్టిక్...
గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో రామ్‌చరణ్ ఓ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తోన్నాడు.