తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajamouli Says Bahubali Has Proved That Indian Film Industry Is Not Only Bollywood

ss rajamouli: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు - రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

17 September 2022, 12:47 IST

  • ss rajamouli: బాహుబలి సక్సెస్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఒక్కటే కాదనే వాస్తవాన్ని అభిమానులు గ్రహించడం మొదలుపెట్టారని అన్నాడు రాజమౌళి. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు రాజమౌళి. 

రాజ‌మౌళి
రాజ‌మౌళి (twitter)

రాజ‌మౌళి

ss rajamouli: ఆర్ఆర్ఆర్ తో భార‌తీయ సినీ అభిమానుల‌తో పాటు విదేశీ ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు దిగ్గజ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇటీవ‌ల రాజ‌మౌళి టొరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. టాలీవుడ్ క‌ల్చ‌ర్‌తో పాటు త‌న ఫిలిం మేకింగ్ లో తన స్టైల్ గురించి పలు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని అక్క‌డి అభిమానుల‌తో పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Pawan Kalyan Hhvm Teaser: దొర‌ల లెక్క‌లు స‌రిచేసే దొంగ - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో 5 భాషల్లో మలయాళ బ్లాక్ బస్టర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Krishna mukunda murari may 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద

Vennela Kishore OMG Movie: అక్షయ్ కుమార్ టైటిల్‌తో వెన్నెల‌కిషోర్ హార‌ర్ మూవీ - ఓ మంచి ద‌య్యం భ‌య‌పెడుతోంద‌ట‌!

త‌న సినిమాల‌పై పురాణాల ప్ర‌భావాన్ని గురించి రాజ‌మౌళి మాట్లాడుతూ రామాయ‌ణ‌, మ‌హాభారాతాల్లో ఉన్న నాట‌కీయ‌త‌, యాక్ష‌న్, ఎమోష‌న్ ఏ పురాణాల్లో క‌నిపింద‌ని అన్నాడు రాజ‌మౌళి. ఈ ఇతిహాసాల ఆధారంగా ఇత‌ర భాష‌ల కంటే తెలుగులోనే ఎక్కువ‌గా సినిమాలొచ్చాయ‌ని పేర్కొన్నారు. పురాణాల్లోని సారాన్ని, పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకొని బాహుబ‌లి సినిమా రూపొందించాన‌ని తెలిపాడు. బాషాప‌ర‌మైన హ‌ద్దుల‌ను చెరిపివేస్తూ అన్ని ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కులకు బాహుబలి చేరువైంద‌ని తెలిపాడు. బాహుబలి సక్సెస్ త‌ర్వాతే టాలీవుడ్ సినిమాల పట్ల వరల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల దృష్టిసారించ‌డం మొద‌లుపెట్టార‌ని అన్నాడు.

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంటే బాలీవుడ్ ఒక్క‌టే కాదు మిగిలిన టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాట మిగిలిన సినీ ప‌రిశ్ర‌మ‌లు కూడా ఉన్నాయ‌నే వాస్త‌వాన్ని సినీ అభిమానులు గ్ర‌హించ‌డం మొద‌లుపెట్టార‌ని తెలిపాడు. ఆర్ఆర్ఆర్ సినిమాపై ప‌లువురు హాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. అమెరికాతో పాట ప‌లు దేశాల్లో ఈసినిమా చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

విదేశీ ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా త‌దుప‌రి సినిమాల రూప‌క‌ల్ప‌న‌లో ఏవైనా మార్పులు చేస్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌దైన సెన్సిబిలిటీస్ తో కూడిన కథలను వెండితెరపై ఆవిష్కరించడానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నాడు రాజ‌మౌళి. ఫారిన్ ప్రేక్ష‌కుల కోసం ఓన్ స్టైల్ కు ఎప్ప‌టికీ దూరం కాన‌ని స్ప‌ష్టం చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.