తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Day 1 Collection: పుష్ప 2 మూవీకి 300 కోట్లు! రాజమౌళి రికార్డ్స్ పటాపంచలు! ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa 2 Day 1 Collection: పుష్ప 2 మూవీకి 300 కోట్లు! రాజమౌళి రికార్డ్స్ పటాపంచలు! ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

06 December 2024, 8:48 IST

google News
  • Pushpa 2 The Rule Day 1 Worldwide Box Office Collection: పుష్ప 2 ది రూల్ ఇండియా బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డ్ కొట్టనుందని ట్రేడ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టనుందని, రాజమౌళి సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

పుష్ప 2 మూవీకి 300 కోట్లు! రాజమౌళి రికార్డ్స్ పటాపంచలు! ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
పుష్ప 2 మూవీకి 300 కోట్లు! రాజమౌళి రికార్డ్స్ పటాపంచలు! ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

పుష్ప 2 మూవీకి 300 కోట్లు! రాజమౌళి రికార్డ్స్ పటాపంచలు! ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa 2 The Rule Box Office Collection Day 1: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన పుష్ప 2 ది రూల్ మూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

పుష్ప 2 డే 1 ఇండియా కలెక్షన్స్

పుష్ప 2 మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.165 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయింది. దీంతో రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీని దాటేసింది. అయితే, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తొలి రోజు భారతదేశంలో రూ. 133 కోట్లు, బాహుబలికి రూ. 133 కోట్ల (తెలుగులో రూ.103.13 కోట్లు, హిందీ రూ.20.07 కోట్లు, తమిళం రూ.6.5 కోట్లు, మలయాళం రూ.3.1 కోట్లు, కన్నడ రూ.0.2 కోట్లు) కలెక్షన్స్ సంపాదించింది.

రాజమౌళి సినిమాల రికార్డ్

అదే పుష్ప 2 ఫస్ట్ డే 165 కోట్లు రాబట్టి రాజమౌళి సినిమాల రికార్డ్ బ్రేక్ చేసినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. ఈ 165 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 85 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ. 67 కోట్లు, తమిళం నుంచి 7 కోట్లు, కర్ణాటకలో రూ. 1 కోటి, మలయాళంలో రూ. 5 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లుగా సక్నిల్క్ రఫ్ డేటా చెబుతోంది.

పుష్ప 2 ప్రీమియర్ షో కలెక్షన్స్

ఇక పుష్ప 2 ప్రీమియర్ షోలకు అంటే డిసెంబర్ 4న రూ. 10.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకుని పుష్ప 2 ది రూల్ సినిమాకు ఇండియాలో రూ. 175.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 175.1 కోట్ల కలెక్షన్స్‌లో తెలుగులో రూ. 95.1 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి 67 కోట్లు, తమిళం నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి కోటి, మలయాళంలో 5 కోట్ల వసూళ్లు ఉన్నాయి.

పుష్ప 2 థియేటర్ ఆక్యుపెన్సీ

అంటే, ప్రీమియర్ షోలు ఒక్క తెలుగులో మాత్రమే పడినట్లు అర్థమవుతోంది. ఈ లెక్కన పుష్ప 2 ది రూల్ సినిమాకు తెలుగులోనే అధికంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక గురువారం (డిసెంబర్ 5) నాడు పుష్ప 2 సినిమా మొత్తం 82.66% తెలుగు ఆక్యుపెన్సీని సాధించింది. వీటిలో అత్యధికంగా నైట్ షోలలో (90.19%) నమోదైంది. అలాగే, హిందీ ఆక్యుపెన్సీ 59.83 శాతంగా ఉంది. హైదరాబాద్, చెన్నై, జైపూర్ వంటి నగరాల్లో కూడా అత్యధికంగా షోలు పడ్డాయి.

పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇదిలా ఉంటే, పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇంకా విడుదల కాలేదు. యుఎస్‌తోపాటు ఇతర ఉత్తర అమెరికా దేశాలలో భారీ ప్రీ-సేల్ బుకింగ్ కారణంగా, ఈ చిత్రం ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అయితే, పుష్ప 2 వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు ఉండొచ్చని ట్రేడ్ సంస్థ సక్నిల్క్ అంచనా వేస్తోంది.

బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ మూవీగా

అలాగే, పుష్ 2 ది రూల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ మూవీగా మరో రికార్డ్ సొంతం చేసుకోవచ్చని సక్నిల్క్ సంస్థ అంచనా వేస్తోంది. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 223 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. అలాగే, బాహుబలి 2 217 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవేళ పుష్ప 2 తొలి రోజు 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే రాజమౌళి సినిమాల రికార్డ్స్ పటాపంచలు చేసినట్లు అవుతుంది.

తదుపరి వ్యాసం