Amaran 19 Days Collection: రోజు రోజుకు పెరుగుతున్న సాయి పల్లవి అమరన్ కలెక్షన్స్.. 300 కోట్లకు దగ్గరిలో బయోగ్రఫీ మూవీ!
Amaran 19 Days Worldwide Box Office Collection: సాయి పల్లవి, శివ కార్తికేయన్ జోడీగా నటించిన అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరుగా దూసుకుపోతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బయోగ్రాఫికల్ మూవీ అమరన్‌కు 19 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
Amaran Day 19 Box Office Collection: తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ ఉగ్రవాదలుతో పోరాడి అమరుడుయ్యారు. మేజర్ ముకుంద్ వరతరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. ముకుంద్ పాత్రలో కోలీవుడ్ శివకార్తికేయన్ నటించగా ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి యాక్ట్ చేసింది.
ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ
అమరన్ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన అమరన్ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అంటూ అమరన్ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రోజు రోజు పెరుగుతున్న కలెక్షన్స్
అమర్ చిత్రానికి విడుదలైన 19 రోజుల్లోనే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. అమరన్ విడుదలైన 19వ రోజున ఒక్క తమిళనాడులోనే రూ. 1.4 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తెలుగులో రూ. 76 లక్షలు వసూలు చేసింది. అలాగే, 19 రోజుల్లో 149.8 కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.
300 కోట్ల కలెక్షన్స్
ఇండియాలో అమరన్ సినిమా 19 రోజుల్లో రూ. 218.25 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం అమరన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 295 కోట్లు వసూలు చేసింది. వీకెండ్స్‌లో అమరన్ రూ.10 కోట్లకు పైగా వసూలు చేస్తుండటం విశేషం. అయితే, 20 రోజుల్లో అమరన్ మూవీ రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వాస్తవ కథ కావడంతో
మరి 20వ రోజున అమరన్‌కు వచ్చే కలెక్షన్స్ ఎంతో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, కాశ్మీర్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తూ పాక్ ఉగ్రవాదుల చేతిలో హతమైన మేజర్ ముకుంద్ వరదరాజన్ అనే ఆర్మీ జవాను జీవితం ఆధారంగా అమనర్ చిత్రం తెరకెక్కింది. ఇది వాస్తవ కథ కావడంతో ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి ఆదరణ లభించింది.
ఎన్నడూ చూడనివిధంగా
ఈ సినిమాలో శివకార్తికేయన్ వాడిన పెద్ద తుపాకీ నిజమైనదని అంటున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ శివ కార్తికేయన్‌ని మునుపెన్నడూ చూడని కోణంలో చూపించిటన్లుగా తెలుస్తోంది. నడక, వేషధారణ, ఎక్స్‌ప్రెషన్, కండలు తిరిగిన శరీరంతో ముకుంద్ పాత్రకు ప్రతిరూపంగా నిలిచినట్లు తమిళనాట శివకార్తికేయన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రిపీటెడ్ ఆడియెన్స్
అలాగే, శివకార్తికేయన్ నటనలో పూర్తిగా భిన్నమైన కోణంలోకి ప్రవేశించి మళ్లీ ప్రయోగాత్మక ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మంచి విజయం కూడా సాధించాడు. ఒకవైపు సైనికుడి భావోద్వేగం ఆకర్షిస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించిటన్లు సినిమాపై పొగడ్తలు కురుస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ వస్తున్నారని తెలుస్తోంది.