Kalki 2898 AD Box Office: ఒక్కరోజులో 44.44 శాతం పెరిగిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ కలెక్షన్స్- 44 డేస్ వసూళ్లు ఇవే!
Kalki 2898 AD 44 Days Worldwide Collection: ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాకు 44 రోజుల్లో, 44వ రోజున ఇండియా అండ్ వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందాం.
Kalki 2898 AD Box Office Collection: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్ యాక్టర్స్ నటించిన తెలుగు సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఫ్రైడే నాడు 65 లక్షలు
కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో 44వ రోజున రూ. 65 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. అంటే, 43వ రోజుతో పోల్చుకుంటే 44వ రోజున 44.44 శాతం కలెక్షన్స్ పెరిగాయి. 43వ రోజున రూ. 45 లక్షలు రాగా ఏడో శుక్రవారం నాడు 65 లక్షలు వచ్చాయి. ఈ 65 లక్షలలో తెలుగు నుంచి 17 లక్షలు, తమిళం నుంచి లక్ష, హిందీ నుంచి 45 లక్షలు, కర్ణాటక నుంచి లక్ష, మలయాళం నుంచి లక్ష రూపాయలు మాత్రమే వచ్చాయి.
ఇండియాలో ఎక్కువగా హిందీవే
ఈ శుక్రవారం నాడు కూడా హిందీ కలెక్షన్సే ఎక్కువగా ఉన్నాయి. ఇక భారతదేశంలో కల్కి 2898 ఏడీ చిత్రానికి 44 రోజుల్లో రూ. 642.21 కోట్ల నికర వసూళ్లు వచ్చాయి. వీటిలో కూడా హిందీ కలెక్షన్సే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు నుంచి రూ. 285.81 కోట్లు రాగా.. హిందీ వెర్షన్‌కు రూ. 290.35 కోట్లు వచ్చాయి. అలాగే తమిళం నుంచి 36.03 కోట్లు, కన్నడ నుంచి 5.86 కోట్లు, మలయాళం వెర్షన్‌కి 24.16 కోట్లుగా ఉన్నాయి.
ఓవర్సీస్ కలెక్షన్స్
ఆగస్ట్ 9న కల్కి సినిమాకు మొత్తంగా 15.63 తెలుగు థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక ఈ చిత్రం 44 రోజుల్లో రూ. 274.50 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాగే ఇండియావైడ్‌గా కల్కి మూవీకి 44 డేస్‌లో రూ. 762.45 గ్రాస్ డొమెస్టిక్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 1056.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
కల్కి 2898 ఏడీ లాభాలు
రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పటాపంచలు చేసిన కల్కి 2898 ఏడీ సినిమా రూ. 165.16 కోట్ల లాభాలు సాధించి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇవాళ్టి కలెక్షన్స్ అంటే 7వ శనివారం (ఆగస్ట్ 10) అయిన 45వ రోజు కలెక్షన్స్ కూడా ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.
45వ రోజు కలెక్షన్స్
ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం, సమాచారం ప్రకారం కల్కి 2898 ఏడీ సినిమాకు 45వ రోజున ఇండియాలో రూ. 39 లక్షల నికర బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు ట్రేడ్ అనలిస్టులు. ఈ వసూళ్లు రాత్రి షో పడేసరికి పెరిగే ఛాన్స్ కూడా ఉంది.