Pushpa 2 Collection Day 1: పుష్ప 2కు తొలి రోజు 250 కోట్లు.. ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డ్స్ దిగదుడుపే.. ఒక్క అమెరికాలోనే!
05 December 2024, 13:45 IST
Pushpa 2 Day 1 Worldwide Box Office Collection: పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్‌తో అతి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్‌కెక్కనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్ డే రోజున పుష్ప 2 మూవీ సుమారుగా రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టనుందని అంచనా వేశారు.
పుష్ప 2కు తొలి రోజు 250 కోట్లు.. ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డ్స్ దిగదుడుపే.. ఒక్క అమెరికాలోనే!
Pushpa 2 The Rule Box Office Collection Day 1: విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేసిన పుష్ప 2 రూల్ డిసెంబర్ 5 గురువారం విడుదల తర్వాత భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ.100 కోట్లకుపైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ప్రెస్టీజియస్ సినిమా పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాకు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వరల్డ్ వైడ్‌గా రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని కోయిమోయ్ వెబ్ సైట్ తెలిపింది.
బుక్ మై షోలో వన్ మిలియన్ టికెట్స్
బ్లాక్ చేసిన సీట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ రూ.105.67 కోట్లుగా నమోదైంది. దీంతో కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలను అధిగమించి బుక్ మై షోలో అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 మరో రికార్డు సృష్టించింది.
125 కోట్ల గ్రాస్
ఇండియాలో పుష్ప 2 సినిమా రూ.73 కోట్ల గ్రాస్ టికెట్లను విక్రయించింది. అలాగే, అమెరికాలో ఈ సినిమా రూ.35 కోట్ల టికెట్లు (గ్రాస్) అమ్ముడుపోయింది. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు బ్లాక్ చేసిన సీట్లతో సహా సినిమా బుకింగ్ రూ .125 కోట్లు (గ్రాస్) దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి రోజు భారతదేశంలో పుష్ప 2కి సుమారుగా 31,76,479 టికెట్లు అమ్ముడుపోయాయట.
పుష్ప 2 నెట్ కలెక్షన్స్
ఇదిలా ఉంటే, బుధవారం రాత్రి 9:30 గంటలకు పుష్ప 2 ప్రీమియర్స్ పడ్డాయి. గురువారం (డిసెంబర్ 5) వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 ది రూల్ రిలీజ్ అయింది. అన్ని భాషల్లో కలిపి తొలిరోజు ఇండియాలో పుష్ప 2 రూ. 41.54 కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని సమాచారం. అమెరికాలో అయితే, ప్రివ్యూ షోలతో 3.2 మిలియన్ డాలర్లు (రూ. 29 కోట్ల 65 లక్షల90 వేలు) కొల్లగొట్టింది పుష్ప 2.
3 మిలియన్ టికెట్స్ సేల్
ఈ విషయమై బుక్ మై షో సినిమాస్ సీఓఓ ఆశిష్ సక్సెనా మాట్లాడుతూ "పుష్ప 2: ది రూల్ అధికారికంగా చరిత్రను తిరగరాసింది. అడ్వాన్స్ అమ్మకాల్లో 3 మిలియన్ల టికెట్లను క్రాస్ చేసింది. ఇది భారతదేశంలోనే అత్యధికం. ఓపెనింగ్ రోజు అభిమానులు థియేటర్లకు పోటెత్తడంతో ఈ బ్లాక్ బస్టర్ సినిమా మునుపెన్నడూ లేని విధంగా క్రేజ్ తెచ్చుకుంది" అని తెలిపారు.
బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ
అలాగే, రెండో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ బాహుబలి (రూ .217 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ .175 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సినిమాల రికార్డ్స్‌ను తలదన్ని పుష్ప 2 మూవీ ఓపెనింగ్ రోజున రూ.250 కోట్లు సాధించి అతి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా సత్తా చాటనుందని ట్రేడ్ అనిలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.