తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raja Saab Postponed: ప్రభాస్ రాజాసాబ్ మూవీ వాయిదా? సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ‘జాక్’కి లైన్ క్లియర్

Raja Saab Postponed: ప్రభాస్ రాజాసాబ్ మూవీ వాయిదా? సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ‘జాక్’కి లైన్ క్లియర్

Galeti Rajendra HT Telugu

18 December 2024, 18:54 IST

google News
  • Raja Saab Postponed: ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ వాయిదాపడినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ తన సినిమా జాక్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. 

ప్రభాస్
ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ వాయిదా పడిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ.. గత కొన్ని రోజుల నుంచి ఆ మూవీపై సాలిడ్ అప్‌డేట్ లేదు. అయితే.. స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ దర్శకత్వంలో వస్తున్న ‘జాక్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు.

ప్రభాస్‌తో సిద్ధు జొన్నలగడ్డ పోటీనా?

వాస్తవానికి ప్రభాస్ సినిమా వస్తోందంటే తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ సినిమాలు రిలీజ్ చేసేందుకు జంకుతున్నారు. అలాంటిది తెలుగు సినిమా ‘జాక్’ అదే రోజు రిలీజ్‌కి సిద్ధమవడమంటే? ఇక్కడే కొన్ని సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ వరుసగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌‌తో హిట్స్ అందుకుని మంచి ఊపుమీదున్నాడు. అలాంటి సిద్ధు.. ప్రభాస్‌తో పోటీపడే అవకాశం లేదని.. రాజాసాబ్ వాయిదాపడటంతోనే జాక్‌ని అదే రోజు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

చికిత్స కోసం విదేశాలకి ప్రభాస్

రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తవలేదు.. ప్రభాస్‌ ఇటీవల సెట్స్‌లో గాయపడ్డాడు. అతను చికిత్స కోసం విదేశాలకి వెళ్లబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కనీసం ఒక నెల సమయమైనా.. ప్రభాస్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందట. దాంతో రాజాసాబ్ వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాజాసాబ్ వాయిదాతో సిద్ధు జాక్‌కి లైన్ క్లియరైంది.

జాక్ గురించి

జాక్‌లో సిద్దు జొన్నలగడ్డ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పైగానే పూర్త‌య్యిందట. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంది.

తదుపరి వ్యాసం