Daarkaari Movie: రైటర్‌గా సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ ఎంట్రీ - ఫస్ట్ పార్ట్ తీయకుండానే డైరెక్ట్‌గా సీక్వెల్ అనౌన్స్
Daarkaari Movie: సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ దార్కారీ ఎమ్ఎమ్ 2 మూవీతో రైటర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. మ్యాడ్‌లో కీలక పాత్ర పోషించిన రవి ఆంథోనీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Daarkaari Movie: సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ రైటర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. దార్కారీ ఎమ్ఎమ్ 2 పేరుతో ఓ మూవీ చేయబోతున్నాడు. దార్కారీ ద్వారా మ్యాడ్ మూవీలో కీలక పాత్ర పోషించిన రవి ఆంథోనీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ...
దార్కారీ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ మసాలా చిత్రమంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రీ లుక్ పోస్టర్ బంగారం సింహాసనంపై ఓ వ్యక్తి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుకున్నాడు.
అతడి మెడలో బంగారు ఛైన్లు కనిపిస్తున్నాయి. పెద్ద బ్రాస్‌లెట్, చేతి వేళ్లకు గోల్డ్ రింగ్స్ తో గోల్డ్ మెన్‌గా కనిపిస్తున్నాడు.ఆ హీరో ఎవరన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయకుండా డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. పార్ట్ వన్ లేకుండా.. ఇలా రెండో పార్ట్‌ను ప్రకటించి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.
మ్యాడ్‌లో కాలేజీ సీనియర్‌గా...
రవి ఆంథోనీ టిల్లు స్క్వేర్ సినిమాకు రైటర్‌గా పనిచేశాడు. మ్యాడ్ చిత్రంలో కాలేజీ సీనియర్ పాత్రలో కనిపించాడు. దార్కారీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ దార్కారీ మూవీకి కథతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. రైటర్‌గా చైతు జొన్నలగడ్డకు ఇదే ఫస్ట్ మూవీ. చైతు జొన్నలగడ్డ బబుల్‌గమ్ సినిమాలో నటుడిగా కనిపించారు. హీరో తండ్రి పాత్రలో మెప్పించారు. ధార్కారి మూవీ నవ్విస్తూనే థ్రిల్లర్‌ను పంచుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
ప్రభాస్ రాజాసాబ్...
దార్కారీ మూవీలో సంతానం హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే హీరో ఎవరన్నది క్లారిటీ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలను నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. బాలీవుడ్ మూవీ రైడ్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీ రూపొందుతోంది.
ప్రభాస్ రాజాసాబ్ సినిమా పీపుల్ మీడియా బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది. సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గూఢచారి 2తో పాటు విశ్వక్‌సేన్‌తో ఓ సినిమాను నిర్మిస్తోంది. మరో ఇరవై సినిమాలకు ప్రొడక్షన్‌లో ఉన్నాయి.
టాపిక్