Dont wear Gold ring: బంగారు ఉంగరం ఎప్పుడూ ఈ వేలికి ధరించకండి, శని శక్తి పెరిగిపోతుంది-never wear a gold ring on this finger saturns power will increase ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dont Wear Gold Ring: బంగారు ఉంగరం ఎప్పుడూ ఈ వేలికి ధరించకండి, శని శక్తి పెరిగిపోతుంది

Dont wear Gold ring: బంగారు ఉంగరం ఎప్పుడూ ఈ వేలికి ధరించకండి, శని శక్తి పెరిగిపోతుంది

Haritha Chappa HT Telugu
Aug 09, 2024 05:00 PM IST

Dont wear Gold ring: వజ్రం, ముత్యం వంటి ఉంగరాలు ధరించ వచ్చో లేదో తెలుసుకున్నట్టే… బంగారు ఉంగరం ఏ వేలికి పెట్టుకోవాలో, ఏ వేలికి ధరించకూడదో కూడా తెలుసుకోవాలి. లేకుంటే జీవితంలో సమస్యలు వస్తాయి.

గోల్డ్ రింగ్ ఏ వేలికి పెట్టుకోకూడదు?
గోల్డ్ రింగ్ ఏ వేలికి పెట్టుకోకూడదు? (Pixabay)

వజ్రం, ముత్యం, పగడం వంటి ఉంగరాలు ధరించే ముందు వాటిని పెట్టుకోవచ్చో లేదో జ్యోతిష్యుడిని అడిగి ధరిస్తారు. కానీ బంగారు ఉంగరం మాత్రం అందరూ ధరించవచ్చని భావిస్తారు. ధరించే ముందు వేలికి పెట్టుకోవచ్చో లేదో కూడా ఆలోచించరు. బంగారు ఉంగరం మీ జీవితంలో శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విషయం చాలా తక్కువమందికే తెలుసు. అందుకే బంగారు ఉంగరం ధరించే ముందు ఏ వేలికి ధరించవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

గోల్డ్ రింగ్ ఈ వేలికి పెట్టకండి…

మన జీవితంలో క్రమశిక్షణ, నిర్మాణం, కర్మకు అధిపతి… శని దేవుడు. శనికి శక్తి కూడా ముఖ్యం. తద్వారా జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. బంగారానికి సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శక్తి, సంపద, విజయాన్ని సూచిస్తుంది. సూర్యుడు వేడికి, శక్తికి, ఉత్తేజానికి చిహ్నం. ఇక మనకున్న అయిదు వేళ్లలో మధ్య వేలు శనితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైతే బంగారు ఉంగరాన్ని మధ్య వేలుకు పెట్టుకుంటారో శని శక్తి పెరుగుతుంది. బంగారం వల్ల కలిగే సూర్య శక్తి, మధ్య వేలుకి ఉండే శని శక్తి కలిసి… ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.

ఏ వేలికి బంగారు ఉంగరం ధరించాలి?


మధ్యవేలుకి బంగారు ఉంగరం ధరించడం వల్ల మీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోతుంది. మరిన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీరు ఘర్షణ జీవితంలో ఇరుక్కుపోతారు. మీ ఆర్థిక వృద్ధి కూడా తగ్గుతుంది. కాబట్టి మధ్య వేలికి బదులు ఉంగరపు వేలికి బంగారంతో చేసిన ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నించండి. బంగారం బృహస్పతికి సంబంధించినది కూడా. కాబట్టి బంగారు ఉంగరం పెట్టుకున్నాక ఆ వేలితో మద్యం తాగడం లేదా మాంసం తినడం వంటివి చేయవచ్చు. మాంసాహారం తినాల్సి వస్తే బంగారు ఉంగరం తొలగించి తినండి. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని స్వచ్ఛంగా ఉంచండి.

బంగారు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి మీలో పాజిటివిటీని పెంచుతుంది. శరీరంలోకి సూర్యుని శక్తిని పంపుతుంది. గోల్డ్ రింగు పెట్టుకోవడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్ధిక వృద్ధి ఉంటుంది. అలాగే వారిలో ఏకాగ్రతను పెంచుతుంది. జాతకంలో బృహస్పతి బలహీనంతా ఉన్న వారు బంగారు ఉంగరం పెట్టుకోవడం ద్వారా బలోపేతం చేసుకోవచ్చు. మీలో మానసిక శాంతిని పెంచే లక్షణం కూడా బంగారానికి ఉంది.

టాపిక్