తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Released Single Life Song Of Santosh Shoban's Kalyanam Kamaneeyam Movie

Kalyanam Kamaneeyam : పెళ్లి గురించి ప్రభాస్​కు కాల్ చేసిన శర్వానంద్

HT Telugu Desk HT Telugu

10 January 2023, 19:07 IST

    • Santosh Shoban Kalyanam Kamaneeyam Movie Song : యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా కళ్యాణం కమనీయం. ఈ చిత్రంలోని ఓ పాటను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశాడు. ఈ పాటలో శర్వానంద్ కనిపించాడు.
శర్వానంద్
శర్వానంద్

శర్వానంద్

సంతోష్ శోభన్(Santosh Shoban) నటించిన 'కళ్యాణం కమనీయం' సినిమాలోని పాటను ప్రభాస్(Prabhas) రిలీజ్ చేశాడు. ఇందులో ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్(Single Life) అంటే అనే పాటను ప్రభాస్ విడుదల చేశాడు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్(Sharwanand) కనిపించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Siddharth Heeramandi Review: కాబోయే భార్య నటించిన హీరామండిపై సిద్ధార్థ్ రివ్యూ ఇదీ

సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని...లైఫ్ లో పెళ్లి చాలా ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించి పాడారు. పెళ్లయ్యాక శృతితో శివ పడుతున్న కష్టాలు చూసిన శర్వానంద్..మ్యారేజ్ చేసుకున్నాక ఇలా ఉంటుందా అని భయపడుతుంటాడు. ఈ పాట చూపించాక అతనిలో ఓ ఛేంజ్ కనిపిస్తుంది. వెంటనే ప్రభాస్(Prabhas) అన్నా అంటూ ఫోన్ చేసి..వెడ్డింగ్ గురించి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సరదాగా ఉన్న ఈ పాటకి కాన్సెప్ట్ , దర్శకత్వం అనిల్ చేశారు.

ఈ చిత్రం గురించి సంతోష్ శోభన్(Santosh Shoban) మాట్లాడాడు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది తన కల అని చెప్పాడు. అది ఈ చిత్రంతో తీరుతోందన్నాడు. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయని, కోవిడ్ తర్వాత ఇది బిగ్ సంక్రాంతి ఫర్ టాలీవుడ్(Tollywood) అనుకుంటున్నానని తెలిపాడు. తానైతే రిలీజ్ ప్రకారం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వారసుడు చిత్రాలు చూస్తానన్నాడు. వీటితోపాటు తన సినిమా కాబట్టి కళ్యాణం కమనీయం మరింత స్పెషల్ అనుకుంటా అని చెప్పాడు. నాన్న దర్శకత్వంలో ప్రభాస్ నటించిన వర్షం సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అయిందని సంతోష్ గుర్తు చేసుకున్నాడు.

'ఏక్ మినీ కథ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కళ్యాణం కమనీయం(Kalyanam Kamaneeyam) కథ విన్నాను. నా మిత్రుడు, ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అజయ్.. దర్శకుడు అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. మనం రెండు రకాల సినిమాలు చూస్తుంటాం. ఒకటి ఆస్పిరేషనల్, రెండోది రిలేటబుల్. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.' అని సంతోష్ శోభన్ చెప్పాడు.

ఈ చిత్రంలో చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుందని సంతోష్ చెప్పాడు. ఇందులో ఫేక్ నెస్ లేదని, ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుందన్నాడు. ఇందులో శృతి జాబ్ చేస్తుంది శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదని తెలిపాడు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నామన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.