తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas And Samantha Top In Tollywood: టాలీవుడ్‌లో ప్రభాస్‌, సమంతలే టాప్‌.. లేటెస్ట్ సర్వే తేల్చింది ఇదే

Prabhas and Samantha top in tollywood: టాలీవుడ్‌లో ప్రభాస్‌, సమంతలే టాప్‌.. లేటెస్ట్ సర్వే తేల్చింది ఇదే

HT Telugu Desk HT Telugu

17 November 2022, 11:30 IST

    • Prabhas and Samantha top in tollywood: టాలీవుడ్‌లో ప్రభాస్‌, సమంతలే టాప్‌ అని లేటెస్ట్ సర్వే తేల్చింది. ఈ వివరాలను ఆర్మాక్స్‌ మీడియా బుధవారం (నవంబర్‌ 16) వెల్లడించింది.
ప్రభాస్
ప్రభాస్ (HT_PRINT)

ప్రభాస్

Prabhas and Samantha top in tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన హీరో, హీరోయిన్లు ఎవరు? తాజాగా ఆర్మాక్స్‌ మీడియా ప్రకారం మాత్రం వీళ్లలో ప్రభాస్‌, సమంత టాప్‌లో ఉన్నట్లు తేలింది. ఆర్మాక్స్‌ స్టార్స్‌ ఇండియా లవ్స్‌: మోస్ట్‌ పాపులర్‌ మేల్‌, ఫిమేల్‌ తెలుగు స్టార్స్‌ పేరుతో ఆ సంస్థ ఓ సర్వే నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

ఇందులో మేల్‌ కేటగిరీలో ప్రభాస్‌, ఫిమేల్‌ కేటగిరీలో సమంత ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండటం విశేషం. అక్టోబర్‌ నెలకుగాను ఈ ఫలితాలు వెలువడ్డాయి. మేల్‌ స్టార్స్‌లో ప్రభాస్‌ టాప్‌లో ఉండగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. ఇక వీళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, వెంకటేశ్‌ ఉండటం విశేషం.

బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌కు ఇంకా ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదని ఈ సర్వే తేల్చింది. సాహో, రాధేశ్యామ్‌లతో మరో రెండు పాన్‌ ఇండియా మూవీస్‌ చేసిన అతడు.. రానున్న రోజుల్లో ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కేలాంటి ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఆర్ఆర్‌ఆర్‌, పుష్ప మూవీలతో పాన్‌ ఇండియా స్టార్లుగా ఎదిగిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. పాన్‌ ఇండియా వదిలేసి టాలీవుడ్‌కే పరిమితమైనా కూడా మహేష్ బాబు క్రేజ్‌ మాత్రం అలాగే ఉంది. అతడు ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక ఫిమేల్‌ లీడ్‌ విషయానికి వస్తే ఈ మధ్యే యశోద చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత టాప్‌లో ఉంది. ఆమె తర్వాతి స్థానాల్లో కాజల్‌ అగర్వాల్‌, అనుష్క శెట్టి, సాయి పల్లవి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌, తమన్నా భాటియా, కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్‌ ఉన్నారు.

యశోదతో సమంత కూడా పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయింది. త్వరలోనే శాకుంతలంతో మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. యశోద ఇప్పటికే బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అటు పెళ్లి, ఆ తర్వాత బాబుకు జన్మనిచ్చిన తర్వాత చాలా రోజులుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా కాజల్‌ అగర్వాల్‌ ఈ లిస్ట్‌లో రెండోస్థానంలో ఉండటం విశేషం. ఆమె ఇండియన్‌ 2 మూవీలో నటించే ఛాన్స్‌ కొట్టేసిన విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.