Mahesh Babu performs Krishna last rites: తండ్రికి తలకొరివి పెడుతూ కన్నీటి పర్యంతమైన మహేష్‌ బాబు-mahesh babu performs krishna last rites with teary eyes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu Performs Krishna Last Rites With Teary Eyes

Mahesh Babu performs Krishna last rites: తండ్రికి తలకొరివి పెడుతూ కన్నీటి పర్యంతమైన మహేష్‌ బాబు

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 05:39 PM IST

Mahesh Babu performs Krishna last rites: తండ్రి కృష్ణకు తలకొరివి పెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు మహేష్‌ బాబు. ఓ సూపర్‌స్టార్‌ మరో సూపర్‌ స్టార్‌కు కన్నీటి వీడ్కోలు పలకడం ప్రతి అభిమానిని తీవ్రంగా కలచివేసింది.

కృష్ణకు తలకొరివి పెట్టే సమయంలో దుఃఖం ఆపుకోలేకపోయిన మహేష్ బాబు
కృష్ణకు తలకొరివి పెట్టే సమయంలో దుఃఖం ఆపుకోలేకపోయిన మహేష్ బాబు

Mahesh Babu performs Krishna last rites: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు అశ్రు నయనాలతో తమ అభిమాని నటుడికి తుది వీడ్కోలు పలికారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. తన తండ్రికి తలకొరివి పెడుతూ మహేష్‌ బాబు కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. రెండు రోజులుగా ఉబికి వస్తున్న దుఃఖాన్ని తమాయించుకుంటూ వస్తున్న మహేష్.. ఇక చివరి క్షణాల్లో ఆపుకోలేకపోయాడు. బోరున విలపించాడు. అతడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. రెండు నెలల వ్యవధిలోనే తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన మహేష్‌ బాధ వర్ణణాతీతం.

మంగళవారం (నవంబర్‌ 15) తెల్లవారుఝామున కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతనికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం బుధవారం (నవంబర్‌ 16) కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు. దీంతో వేలాది మంది తరలి వచ్చి తమ సూపర్‌ స్టార్‌కు తుది వీడ్కోలు పలికారు.

మహేష్‌ కూడా సూపర్‌ స్టార్‌ కావడంలో కృష్ణ పాత్ర ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచే తండ్రితో కలిసి సినిమాల్లో నటించిన మహేష్‌.. తర్వాత హీరోగానూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు. తండ్రి స్ఫూర్తితోనే హీరో అయిన అతడు.. కృష్ణలాగే ఎంతో అందగాడు. ఆ అందమే ఈ తండ్రీ కొడుకులను టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలబెట్టింది. బాలనటుడిగా తండ్రితో కలిసి మహేష్‌ సుమారు 25 సినిమాల్లో నటించడం విశేషం.

IPL_Entry_Point

టాపిక్