Prabhas 20 years in TFI: ప్రభాస్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. రెండు దశాబ్దాల్లో ఎన్నో హిట్లు..!-prabhas completed 20 years in telugu film industry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Prabhas Completed 20 Years In Telugu Film Industry

Prabhas 20 years in TFI: ప్రభాస్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. రెండు దశాబ్దాల్లో ఎన్నో హిట్లు..!

Maragani Govardhan HT Telugu
Nov 11, 2022 05:20 PM IST

Prabhas 20 years in TFI: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు చిత్రసీమలో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం ఈశ్వర్ విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తయింది. రెండు దశాబ్దాల్లో ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నాడు మన డార్లింగ్.

ప్రభాస్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం
ప్రభాస్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం

Prabhas 20 years in TFI: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాంతీయ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగాడు. ఈశ్వర్‌తో మొదలెట్టిన ప్రభాస్ ప్రయాణం.. నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తోన్న ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియావే కావడం విశేషం. నటనతోనే కాకుండా సింప్లిసిటీతోనూ అందరికీ నచ్చే, అందరూ మెచ్చే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ప్రభాస్ ప్రస్థానం చిత్రసమీలో అప్పుడే 20 ఏళ్లు కావస్తుంది. మన డార్లింగ్ నటించిన తొలి చిత్రం ఈశ్వర్ విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈశ్వర్ చిత్రం 2002 నవంబరు 11న విడుదలైంది. అప్పుడు ఓ ప్రాంతీయ హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పుడు భారతీయ చలనచిత్రసీమలోనే అతి పెద్ద స్టార్. బాహుబలితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేస్తున్నాడు. గత 20 ఏళ్లలో ప్రభాస్ తన నటనతో ఎంతో పరిణితీ సాధించి ప్రస్తుతం ఇంతటి స్టార్‌డమ్ సంపాదించాడు. ఆయన నటించిన ఈశ్వర్ ఇప్పటికీ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుండగా.. ఏడాది చివర్లో సలార్ చిత్రంతో మెప్పించనున్నాడు. 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుత చిత్రాల్లో ప్రేక్షకులను అలరించాడు మన డార్లింగ్. ఈశ్వర్, వర్షం, ఛత్రపతి, యోగి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 లాంటి సూపర్ హిట్లతో ఆడియెన్స్‌లో చెరగని ముద్ర వేశాడు ప్రభాస్,

ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే, స్పిరిట్ లాంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవి కాకుండా మారుతీతో ఓ సినిమా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా కూడా క్యూలో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని కొత్త కథలు కూడా వింటున్నాడు. 20 ఏళ్ల కెరీర్‍‌లో ఎత్తులను అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలతో మరో ఎత్తుకు ఎదిగే అవకాశముంది.

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.