Yashoda OTT Release Date: సమంత యశోద ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే
Yashoda OTT Release Date: సమంత హీరోయిన్‌గా నటించిన యశోద సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...
Yashoda OTT Release Date: యశోద సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఒకే రోజు విడుదలైంది.
ట్రెండింగ్ వార్తలు
సరోగసీ కాన్సెప్ట్‌కు ఆసక్తికరమైన మలుపుల్ని జోడించి తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగుతో పాటు మిగిలిన పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇందులో యశోద అనే ధైర్యవంతురాలైన యువతిగా సమంత కనిపించింది. సరోగసీ పేరుతో ఓ పెద్ద క్రైమ్ వరల్డ్ నడుపుతోన్న సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై యశోద ఎలాంటి పోరాటాన్ని సాగించిందనేది థ్రిల్లింగ్‌గా దర్శకద్వయం ఈ సినిమాలో చూపించారు.
కాగా యశోద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మేకర్స్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈసినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు నలభై ఐదు కోట్లకు భారీ పోటీ మధ్య అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం.
తెలుగుతో పాటు అన్ని భాషలకు చెందిన హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ సెకండ్‌వీక్‌లో యశోద సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
యశోద సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించారు. రావురమేష్, శత్రు, సంపత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్స్‌కు సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పింది. తెలుగులో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సమంత నటించిన సినిమా ఇది. సమంత కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది.