తెలుగు న్యూస్  /  Entertainment  /  Pil Canceled By Telangana High Court Which Was Filed Against Rrr

RRR | ఆర్ఆర్ఆర్ చిత్రానికి హైకోర్టులో ఊరట.. సినిమా నిలుపుదల పిల్ కొట్టివేత

HT Telugu Desk HT Telugu

15 March 2022, 23:16 IST

    • ఆర్ఆర్ఆర్ ప్రదర్శన నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి, కొమురం భీమ్ పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి భంగం కలగలేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి హైకోర్టులో ఊరట
ఆర్ఆర్ఆర్ చిత్రానికి హైకోర్టులో ఊరట (twitter)

ఆర్ఆర్ఆర్ చిత్రానికి హైకోర్టులో ఊరట

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా నటించి రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన కల్పిత కథ ఈ సినిమా. ఇందులో అల్లూరిగా చరణ్ నటిస్తుండగా.. భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారించిన ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

ట్రెండింగ్ వార్తలు

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ దర్మాసనం ఈ పిల్‌పై ఇవాళ విచారణ చేపట్టింది. అల్లూరి సీజరామరాజును పోలీసుగా చూపి చరిత్రను వక్రీకరించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే అల్లూరి, కొమురం భీమ్‌లను దేశభక్తులుగానే చూపామని, ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథేనని దర్శక, నిర్మాతల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. అంతేకాకుండా సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా జారీ చేసిందని గుర్తుచేశారు.

ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సినిమాతో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి భంగం కలగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలాయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.