తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: నాగబాబు అప్పు తీర్చడానికే ఆ 2 సినిమాలు చేశా.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Pawan Kalyan: నాగబాబు అప్పు తీర్చడానికే ఆ 2 సినిమాలు చేశా.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu

03 July 2024, 14:10 IST

google News
  • Pawan Kalyan About Gabbar Singh And Nagababu Debts: మెగా బ్రదర్ నాగబాబు అప్పు తీర్చడానికే ఆ రెండు సినిమాలు తాను చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ రెండు సినిమాలు ఏంటని చూస్తే..

నాగబాబు అప్పు తీర్చడానికే ఆ 2 సినిమాలు చేశా.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
నాగబాబు అప్పు తీర్చడానికే ఆ 2 సినిమాలు చేశా.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

నాగబాబు అప్పు తీర్చడానికే ఆ 2 సినిమాలు చేశా.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Pawan Kalyan About Nagababu Debt: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉండే క్రేజ్ వేరు. ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయపరంగా కూడా ఆయన ప్రజల అభిమానాలు పొందారు. దానికి నిదర్శనమే ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 21కి 21 స్థానాల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గెలుపొందడం. ఫలితంగా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తన విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలను కూడా కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో చేసిన పవన్ కల్యాణ్ కామెంట్స్ షార్ట్స్ రూపంలో దర్శనం ఇస్తున్నాయి.

గబ్బర్ సింగ్ సినిమా తనకు నచ్చలేదని, బ్రదర్ నాగబాబు అప్పు కోసమే ఆ మూవీ చేయడానికి ఒప్పుకున్నట్లు యాంకర్ శిల్పా చక్రవర్తి చేసిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. "గబ్బర్ సింగ్ సినిమాలో మీ పాత్ర, మీ నటన చాలా మందికి నచ్చింది. అందుకే దాన్ని ఎక్ట్సెండ్ చేద్దామనే సర్దార్ గబ్బర్ సింగ్ చేయాలనుకుంటున్నారా?" అని శిల్పా చక్రవర్తి అడిగింది.

దానికి "నిజానికి గబ్బర్ సింగ్ సినిమా నాకు అవసరం లేకుండా వచ్చింది. ఔట్ ఆఫ్ నెసెసిటీ నాకు దబాంగ్ సినిమా చూపించారు. దబాంగ్ రిలీజైన రెండు, మూడు నెలలకు నాకు చూపిస్తే అది ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. సల్మాన్ ఖాన్ పర్సనల్ ఉంది, ఆయన వ్యక్తిత్వం ఏదో ఉంది. మాములుగా కథలో తల్లి ఉంటుంది, ఇలా ఉంటుంది. కొత్తగా ఏముంది ఇందులో అనుకుని నేను చేయలేదు" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

"మేము కూడా సినిమా చూసేటప్పుడు సల్మాన్ ఖాన్‌ను తలుచుకోలేదు. మేము కొత్త గబ్బర్ సింగ్‌ను చూశాం" అని శిల్పా చక్రవర్తి అన్నారు. "హా.. నేను అదే అంటున్నాను. దానికి కారణం ఏంటంటే.. మా బ్రదర్‌కు ఏదో సమస్యలు ఉంటే.. ఏదో ఫిల్మ్‌కు సంబంధించి ఫినాన్షియల్ సమస్యలు ఉంటే ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. వెంటనే సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి. అప్పుడు అది నాకు అవసరం అనిపించి చేశాను" అని పవన్ కల్యాణ్ బదులిచ్చారు.

"రెండు గబ్బర్ సింగ్‌లు నాకు మీద వచ్చాయి. అంతేగానీ నాకు సినిమా చేయాలనికంటే కూడా డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దానిమీదే ఫస్ట్ వచ్చింది. అలాగే సినిమా స్టార్ట్ అయింది" అని పవన్ కల్యాణ్ వివరించారు. దాంతో ఈ విషయం మాకు తెలియదు అని యాంకర్ శిల్పా చక్రవర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"ఫస్ట్ గబ్బర్ సింగ్ అలాగే వచ్చింది. చాలా ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. వాళ్లకోసం సినిమా చేయాలి. ఎలాంటి సినిమా చేయాలి. ఏ సినిమా చేస్తే సేఫ్ అవుతాం. చాలా త్వరగా అయిపోవాలి. అప్పుడు ఆలోచిస్తే దబాంగ్ గుర్తుకు వచ్చింది. మళ్లీ ఓసారి చూద్దాం అని చూశాను" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

అయితే బ్రదర్‌కు సినిమా ఇష్యూస్ అంటే.. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాత్రమే అప్పుడు నిర్మాతగా చిత్రాలు నిర్మించారు. కాబట్టి బ్రదర్ నాగబాబు కోసమే గబ్బర్ సింగ్ సినిమా చేయాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా నెటిజన్స్ కామెంట్స్ రూపంలో చెబుతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం