Kalki 2898 AD Live Updates: ప్రభాస్ కల్కి ప్రదర్శన మధ్యలో పవన్ కల్యాణ్ ఓజీ గ్లింప్స్.. వీడియో వైరల్-kalki 2898 ad movie review box office collection audience response live updates prabhas kalki new updates cameo role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Live Updates: ప్రభాస్ కల్కి ప్రదర్శన మధ్యలో పవన్ కల్యాణ్ ఓజీ గ్లింప్స్.. వీడియో వైరల్

కల్కి 2898 ఏడీ లైవ్ అప్డేట్స్

Kalki 2898 AD Live Updates: ప్రభాస్ కల్కి ప్రదర్శన మధ్యలో పవన్ కల్యాణ్ ఓజీ గ్లింప్స్.. వీడియో వైరల్

08:31 AM ISTJun 27, 2024 01:50 PM Sanjiv Kumar
  • Share on Facebook
08:31 AM IST

Kalki 2898 AD Movie Live Updates: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర నటీనటులు యాక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీ ఇవాళ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీ మూవీ లైవ్ అప్డేట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ రెస్పాన్స్ వంటి ఇతర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Thu, 27 Jun 202408:20 AM IST

కల్కి థియేటర్‌లో ఓజీ గ్లింప్స్

కల్కి సినిమా ప్రదర్శన సమయంలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ గ్లింప్స్ వేశారని ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంత నిజముందనేది తెలియదు. వీడియోలో థియేటర్లలో ఓజీ గ్లింప్స్ ప్రదర్శించడం మాత్రమే ఉంది. అది ఎప్పుడు ఎక్కడ ఏ థియేటర్ అనేది క్లారిటీ లేదు.

Thu, 27 Jun 202408:01 AM IST

మహాభారతం విజువల్స్

కల్కి సినిమాలో మహాభారతానికి సంబంధించిన విజువల్స్ అదిరిపోయాయని టాక్ వస్తోంది. ఎవరు క్రియేట్ చేయని విధంగా ఆ గ్రాఫిక్స్ ఉన్నాయని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Thu, 27 Jun 202407:47 AM IST

కల్కి సీన్స్ వీడియోలు వైరల్

కల్కి సినిమాకు సంబంధించిన చాలా వరకు సన్నివేశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి సీన్స్ రివీల్ చేయకూడదని మేకర్స్ విన్నవించుకున్న ఇలాంటివి మాత్రం ఆగట్లేదు. వీటి ద్వారా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోల్పోయే అవకాశం ఉందని మేకర్స్ చెప్పారు.

Thu, 27 Jun 202407:30 AM IST

జక్కన్నపై సెటైర్

కల్కి సినిమాలో రాజమౌళికి సీన్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రాజమౌళిపై ప్రభాస్ సెటైర్ వేస్తాడు. ఈయనకి దొరికితే ఐదేళ్లు దూల తీర్చేస్తాడు అని ప్రభాస్ అనడం కామెడీగా ఉంది.

Thu, 27 Jun 202407:15 AM IST

షో క్యాన్సిల్-పరిహారం

పూణెలోని ఐమాక్స్ థియేటర్‌లో కల్కి షో క్యాన్సిల్ అయింది. దీంతో థియేటర్ యాజామాన్యంపై ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. దానికి బదులుగా పరిహారం చెల్లించాల్సిందిగా కోరారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Thu, 27 Jun 202406:56 AM IST

విజయ్ దేవరకొండ వీడియో వైరల్

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ సీన్‌కు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ యుద్ధపు సన్నివేశంలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అలాగే కృష్ణుడుని ఈ వీడియోలో చూపించారు. అయితే సినిమాలోని సీన్స్ పోస్ట్ చేసి స్పాయిల్ చేయొద్దని మేకర్స్ కోరారు. కానీ, అవేం పట్టించుకోకుండా ఓ నెటిజన్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Thu, 27 Jun 202406:41 AM IST

బ్రహ్మానందం పాత్ర

బ్రహ్మానందం పాత్ర కూడా కల్కి సినిమాలో బాగుందని, ఆయన కామెడీ ఆకట్టుకునేలా ఉందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఆకట్టుకుందని అంటున్నారు.

Thu, 27 Jun 202406:25 AM IST

రాజమౌళి నిద్రపోడు

“ఎస్ఎస్ రాజమౌళికి ఇప్పటివరకు కాంపిటీషన్ లేదు. కానీ, ఈ సినిమాతో రాజమౌళి నిద్రకూడా పోడు. రాజమౌళితోపాటు ఆర్జీవి కూడా నటించారు. అన్నిటికంటే ఆర్జీవీ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది” అని ఓ ప్రేక్షకుడు తెలిపాడు.

Thu, 27 Jun 202406:09 AM IST

కల్కిలో లేని నాని పాత్ర

కల్కి సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తాడని బాగానే ప్రచారం జరిగింది. కానీ, ఇక్కడ నాని అభిమానులకు నిరాశ కలిగినట్లే. ప్రభాస్ సినిమాలో నాని ఎలాంటి పాత్ర పోషించలేదని సమాచారం.

Thu, 27 Jun 202405:55 AM IST

కనిపించని సీనియర్ ఎన్టీఆర్

కల్కి 2898 ఏడీ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తారనే టాక్ జోరుగా వచ్చింది. కానీ, చిత్రంలో మాత్రం కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ కనిపించలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. కృష్ణుడిని చూపించే సీన్‌లో బ్లర్ చేసినట్లు చెబుతున్నారు.

Thu, 27 Jun 202405:43 AM IST

గర్భవతిగా మాళవిక

కల్కి సినిమాలో మాళవిక నాయర్ కూడా యాక్ట్ చేసింది. సినిమా ట్రైలర్ చూస్తే ఆమె గర్భవతిగా కనిపించింది. ఇంతకుముందు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోయిన్‌గా మాళవిక నటించింది.

Thu, 27 Jun 202405:18 AM IST

ప్ర‌భాస్ రోల్ లెంగ్త్ ఎంతంటే?

క‌ల్కి మూవీలో ప్ర‌భాస్ కంటే అమితాబ్ బ‌చ్చ‌న్ రోల్ ఎక్కువ‌గా స్ట్రీన్‌పై క‌నిపిస్తుంద‌ని అభిమానులు చెబుతోన్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ మొత్తం నిడివి గంట లోపే ఉంటుంద‌ని అంటున్నారు.

Thu, 27 Jun 202405:05 AM IST

ప‌ది నిమిషాల లోపే...

క‌ల్కి 2898 ఏడీ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ క్యారెక్ట‌ర్ ప‌ది నిమిషాల లోపే క‌నిపిస్తుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. క‌మ‌ల్ విల‌నిజాన్ని అనుకున్న స్థాయిలో సినిమాలో డైరెక్ట‌ర్ చూపించ‌లేక‌పోయాడ‌ని అంటున్నారు.

Thu, 27 Jun 202404:59 AM IST

మృణాల్ ఠాకూర్ కూడా

ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్‌తోపాటు మృణాల్ ఠాకూర్ కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది. గర్భవతి పాత్రలో మృణాల్ కనిపించిందని ప్రేక్షకులు అంటున్నారు.

Thu, 27 Jun 202404:59 AM IST

రాజ‌మౌళి..ఆర్‌జీవీ

క‌ల్కి మూవీలో తెలుగు డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి, రామ్‌గోపాల్ వ‌ర్మ గెస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించారు. వీరి గెస్ట్ అప్పిరియెన్స్ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తున్నాయి. వీరితో పాటు జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కూడా గెస్ట్‌గా న‌టించాడు.

Thu, 27 Jun 202404:28 AM IST

మ‌హాభార‌తం...విజ‌య్ దేవ‌ర‌కొండ‌

క‌ల్కి సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించాడు. మ‌హాభార‌తం ఎపిసోడ్స్‌లో విజ‌య్ క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. విజ‌య్ అర్జునుడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని చెబుతోన్నారు.

Thu, 27 Jun 202404:05 AM IST

గ్యాపులో 15 సినిమాలు

కల్కి సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ఆయన సైన్ చేసినప్పుడు తన కెరీర్‌లో 35వ మూవీ. కానీ, కల్కి విడుదలయ్యే సమయానికి సంతోష్ నాారాయణ్‌కు ఇది 50వ సినిమా అయింది. అంటే ఈ గ్యాపులో 15 చిత్రాలను సంతోష్ పూర్తి చేశారు.

Thu, 27 Jun 202403:50 AM IST

అసలు కథ

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా అంతా పాత్రల పరిచయంతోనే సాగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి సీక్వెల్ ఉందని, అసలు కథ అందులోనే ఉందని రివ్యూలు వస్తున్నాయి.

Thu, 27 Jun 202403:29 AM IST

నార్త్ అమెరికా కలెక్షన్స్

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా అప్పుడే కలెక్షన్ల మోత మోగిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు ఇప్పటికీ 3.5 మిలియన్ డాలర్స్ వచ్చాయి. ఇంకా వసూలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Thu, 27 Jun 202403:15 AM IST

ఎమోషన్ ఉంటే

మహాభారతం, సైన్స్ ఫిక్షన్‌తో అద్భుతమైన విజువల్స్‌తో కల్కి సినిమాను తీర్చిదిద్దారట నాగ్ అశ్విన్. అయితే సినిమాలో కాస్తా ఎమోషన్ యాడ్ చేస్తే మరో స్థాయిలో ఉండేదని, ప్రభాస్ స్క్రీన్ ప్రజన్స్ తక్కువైందని రివ్యూలు వస్తున్నాయి.

Thu, 27 Jun 202402:53 AM IST

ప్రభాస్ భారీ కటౌట్

ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ థియేటర్ వద్ద ప్రభాస్ పై అభిమానం చాటుతూ భారీ కటౌట్ పెట్టారు ఫ్యాన్స్. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Thu, 27 Jun 202402:24 AM IST

స్పాయిల్ చేయకండి

కల్కి సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించామని, స్క్రీనింగ్ టైమ్‌లో టైమ్ టు టైమ్ ప్రతిదీ అప్డేట్ పెడుతూ స్పాయిల్ చేయొద్దని మూవీ టీమ్ కోరింది. పైరసీ, సోషల్ మీడియాలో వీడియోలు వంటివి షేర్ చేయొద్దని కోరింది.

Thu, 27 Jun 202402:09 AM IST

6 వేల సంవత్సరాల మధ్య

కల్కి సినిమా మహాభారతంతో ప్రారంభమై కలి యుగంలో ముగుస్తుందని నాగ్ అశ్విన్ తెలిపారు. 6 వేల సంవత్సరాల మధ్య కాలంలో జరిగే కథగా ఆయన చెప్పారు.

Thu, 27 Jun 202401:46 AM IST

అదిరిపోయిన క్లైమాక్స్

కల్కి 2898 ఏడీ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోయిందని టాక్ వస్తోంది. సినిమా చూసిన ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అని చెబుతున్నారు.

Thu, 27 Jun 202401:28 AM IST

ప్రభాస్ స్టార్ కాదు

నిజానికి ప్రభాస్ స్టార్ కాదని, అతను బాక్సాఫీస్ సంపద అని పలు వెబ్ సైట్స్ పేర్కొంటున్నాయి. బాహుబలి 2 సినిమాతోనే అతను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టడని నిరూపించాయని తెలిపాయి.

Thu, 27 Jun 202401:15 AM IST

4 సినిమాలతోనే

ప్రభాస్ కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టనుందని అంచనా వేస్తున్నారు. షారూఖ్ ఖాన్ స్టార్‌డమ్‌ను మించి ప్రభాస్ రేంజ్ పెరిగిపోయిందని, కేవలం నాలుగు సినిమాలతోనే డార్లింగ్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటాడని లెక్కలు చెబుతున్నాయి.

Thu, 27 Jun 202401:06 AM IST

సీనియర్ ఎన్టీఆర్

ప్రభాస్ భైరవగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో శ్రీ కృష్ణుడిగా విశ్వ విఖ్యాత, స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించారని టాక్ నడుస్తోంది. డీప్ ఫేక్, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆయన పాత్రను తీర్చిదిద్దారని సమాచారం.

Thu, 27 Jun 202412:53 AM IST

కల్కి బడ్జెట్

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ కల్కి సినిమాను రూపొందించింది. ఈ సినిమాకు దాదాపుగా రూ. 700 కోట్ల బడ్జెట్ అయినట్లుగా సమాచారం. ఈ మూవీకి నిర్మాతగా సి. అశ్వనీ దత్ వ్యవహరించారు.

Thu, 27 Jun 202412:53 AM IST

మైథాలజీ ఆధారంగా

నాగ్ అశ్విన్ కల్కి సినిమాను పురాణాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. కలిని అంతం చేసే కల్కి అవతారం కథకు సైన్స్ ఫిక్షన్ జోడించి రూపొందించారు.

Thu, 27 Jun 202412:53 AM IST

20 నిమిషాల తర్వాతే

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీలో 20 నిమిషాల తర్వాతే భైరవ పాత్ర అంటే ప్రభాస్ ఎంట్రీ ఉండనుందట. అంటే అంతవరకు సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదైనా చూపించనున్నారని తెలుస్తోంది.

Thu, 27 Jun 202412:53 AM IST

మలయాళ భామ ఎంట్రీ

కల్కి 2898 ఏడీ సినిమాతో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ పరిచయం కానుంది. మలయాళంలో చాలా పాపులర్ అయిన ఈ బ్యూటి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోనుంది. అన్నా బెన్ మాలీవుడ్‌లో నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Thu, 27 Jun 202412:52 AM IST

విలన్‌గా కమల్ హాసన్

ప్రభాస్ ప్రెస్టిజీయస్ సినిమా కల్కి 2898 ఏడీలో పవర్‌‌ఫుల్ విలన్‌గా లోక నాయకుడు కమల్ హాసన్ నటించారు. ఇందులో ఆయన పాత్ర పేరు సుప్రీమ్ యస్కిన్.