Nagababu: వరుణ్ తేజ్ పెళ్లిలో నాగబాబు తీరుపై నెటిజన్ల విమర్శలు.. అరిష్టం అంటూ!-netizens slams nagabu for mistake in varun tej lavanya marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagababu: వరుణ్ తేజ్ పెళ్లిలో నాగబాబు తీరుపై నెటిజన్ల విమర్శలు.. అరిష్టం అంటూ!

Nagababu: వరుణ్ తేజ్ పెళ్లిలో నాగబాబు తీరుపై నెటిజన్ల విమర్శలు.. అరిష్టం అంటూ!

Sanjiv Kumar HT Telugu
Nov 03, 2023 12:45 PM IST

Nagababu Mistake At Varun Tej Marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది.

వరుణ్ తేజ్ పెళ్లిలో పెద్ద తప్పు చేసిన నాగబాబు..  దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
వరుణ్ తేజ్ పెళ్లిలో పెద్ద తప్పు చేసిన నాగబాబు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (Instagram)

Varun Tej Lavanya Wedding: టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎంతోకాలంగా ప్రేమించి, ఫైనల్‌గా పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం బుధవారం (నవంబర్ 1) ఇటలీలోని టస్కానీలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయ్యాయి.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా సెలబ్రిటీలతోపాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫొటోలకు "VarunLav" అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో తండ్రి నాగబాబు తీరుపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం కల్యాణ మండపం అంటే దేవాలయంగా భావిస్తారు. వధువు, వరుడిని దేవుళ్లుగా భావిస్తూ మండపంలో కూర్చోబెట్టి వివాహం చేస్తారు.

పవిత్రంగా భావించే మండపంలో నాగబాబు చెప్పులు వేసుకుని ఫొటోలకు పోజులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నాగబాబు కంటే చిన్న హీరోలంతా మండపంలో చెప్పులు లేకుండా ఫొటోలు పోజులిస్తే.. నాగబాబు చెప్పులతో కనిపించడాన్ని తప్పు పడుతున్నారు. కొడుకు పెళ్లిలో నాగబాబు ఇంత పెద్ద తప్పు చేస్తారా అని నెటిజన్లు కామెంట్ల రూపంలో దుమ్మెత్తిపోస్తున్నారు. మరికొంతమంది అయితే, అది అరిష్టం అంటూ కామెట్స్ చేస్తున్నారు.

ఇలా వరుణ్ తేజ్ పెళ్లిని ఎంతో ఘనంగా చేసి నాగబాబు మాత్రం నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే పెళ్లిలో వరుణ్ తేజ్ మనీష్ మల్రోత్రా డిజైన్ చేసిన క్రీమ్ గోల్డ్ కలర్ షేర్వానీ ధరిస్తే.. ఎరుపు రంగు కాంచీ పురం చీరను హీరోయిన్ లావణ్య త్రిపాఠి కట్టుకుంది. దీంతో వరుణ్, లావణ్య జంట ఎంతో చూడముచ్చటగా ఉందంటూ నెట్టింట్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.