Suma Kanakala: యాంకర్ సుమను క్రాస్ చేయాలి.. తమిళ నిర్మాత ఊహించని కామెంట్స్-tamil producer ke gnanavel raja comments on anchor suma kanakala hosting in allu sirish buddy trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suma Kanakala: యాంకర్ సుమను క్రాస్ చేయాలి.. తమిళ నిర్మాత ఊహించని కామెంట్స్

Suma Kanakala: యాంకర్ సుమను క్రాస్ చేయాలి.. తమిళ నిర్మాత ఊహించని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jun 28, 2024 06:23 AM IST

KE Gnanavel Raja About Anchor Suma Kanakala Hosting Events: యాంకర్ సుమ కనకాల హోస్టింగ్ ఈవెంట్స్ నెంబర్ క్రాస్ చేయాలని తమిళ పాపులర్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఊహించని కామెంట్స్ చేశారు. అల్లు శిరీష్ బడ్డీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ సుమను క్రాస్ చేయాలి.. తమిళ నిర్మాత ఊహించని కామెంట్స్
యాంకర్ సుమను క్రాస్ చేయాలి.. తమిళ నిర్మాత ఊహించని కామెంట్స్

Anchor Suma KE Gnanavel Raja Buddy Trailer Launch: యాంకర్ సుమ గురించి బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. ఒక షో కానీ, ఈవెంట్ కానీ తన మాటలతో, పంచ్ టైమింగ్‌తో ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా మారుస్తారు. ఎలాంటి సెలబ్రిటీ అయిన తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అలాంటి సుమ కనకాల హోస్టింగ్‌పై తమిళ స్టార్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతల్లో ఒకరైన కేఈ జ్ఞానవేల్ రాజా హాజరయ్యారు. అయితే, ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ సంస్థ కండక్ట్ చేసింది. అలాగే కార్యక్రమాన్ని శ్రేయాస్ శ్రీనివాస్ కూతురు ఆధ్య హోస్ట్ చేసింది. ఆమె హోస్టింగ్‌ను మెచ్చుకుంటూ యాంకర్ సుమపై కేఈ జ్ఞానవేల్ రాజా సరదాగా కామెంట్ చేశారు.

"హైదరాబాద్‌లోని మీడియా మిత్రులను, తెలుగు ఆడియెన్స్‌ను, ఇక్కడి మంచి ఫుడ్‌ను మిస్ అవుతుంటాను. మీరంతా ఎన్నో ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సంస్థను ఆదరిస్తున్నారు. మా మూవీస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న ఆధ్య.. శ్రేయాస్ శ్రీనివాస్ వాళ్ల పాప. తను బాగా హోస్టింగ్ చేస్తోంది. సుమ గారి ఈవెంట్స్ నెంబర్ ఆధ్య క్రాస్ చేయాలని కోరుకుంటున్నా" అని కేఈ జ్ఞానవేల్ రాజా అన్నారు. దాంతో అంతా నవ్వేశారు.

"గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ కలిసి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాతో జీవీ ప్రకాష్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశాం. సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా తమిళంలో మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్ బాగా సపోర్ట్ చేశారు" అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలిపారు.

"డైరెక్టర్ శామ్ బడ్డీతో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్‌ను ఎక్కువ నమ్మాను. ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ ప్రేమకథా చిత్రమ్ రీమేక్ తర్వాత మరోసారి మా సంస్థలో పనిచేస్తున్నారు. రూబెన్ పుష్ప, జవాన్ సినిమాలకు వర్క్ చేశారు. హిప్ హాప్ తమిళ మా బడ్డీ మూవీకి బ్యాక్ బోన్. ఆయన సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు" అని నిర్మాత చెప్పుకొచ్చారు.

"ఫైట్ మాస్టర్ శక్తి శరవణన్ ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మా కంగువ మూవీ వీఎఫ్ఎక్స్‌కు వర్క్ చేసిన హరిహర సుతన్ బడ్డీకి కూడా పనిచేశారు. విజువల్ ఎఫెక్టులు న్యాచురల్‌గా ఉంటాయి. హీరోయిన్స్ గాయత్రి, ప్రిషాలకు వాళ్ల కెరీర్‌లో ఇంపార్టెంట్ ఫిలిం అవుతుంది" అని కంగువా నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పారు.

"అల్లు శిరీష్ మా కుటుంబంలో ఓ సభ్యుడు లాంటి వారు. ఆయన ఫేవరేట్ హీరో సూర్య. మా జర్నీలో గుడ్ బ్యాడ్ టైమ్స్‌లో శిరీష్ సపోర్ట్‌గా ఉన్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. బడ్డీ సినిమా ఫుటేజ్ కొంతమందికి చూపించాను. శిరీష్ బడ్డీలో బాగా కనిపించారు, బాగా నటించారు అని వాళ్లు చెప్పారు" అని కేఈ జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.

"మధుర శ్రీధర్ గారు మా ఆవారా సినిమా టైమ్ నుంచి పరిచయం. ఆవారా సాంగ్స్ మధుర ఆడియోలో రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్‌గా ఉన్నారు. శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. జూలై 26న బడ్డీ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నా" అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఆకాంక్షించారు.

WhatsApp channel