Paarijatha Parvam: కిడ్నాప్ చేయడం ఒక కళ.. యాంకర్ సుమ వదిలిన పారిజాత పర్వం-anchor suma released paarijatha parvam trailer shraddha das chaitanya rao sunil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Paarijatha Parvam: కిడ్నాప్ చేయడం ఒక కళ.. యాంకర్ సుమ వదిలిన పారిజాత పర్వం

Paarijatha Parvam: కిడ్నాప్ చేయడం ఒక కళ.. యాంకర్ సుమ వదిలిన పారిజాత పర్వం

Sanjiv Kumar HT Telugu
Apr 13, 2024 12:26 PM IST

Anchor Suma Paarijatha Parvam Trailer: స్టార్ యాంకర్ సుమ కనకాల పారిజాత పర్వం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ కిడ్నాప్ నేపథ్యంలో సాగనుంది. ట్రైలర్‌లో డైలాగ్స్, సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

కిడ్నాప్ చేయడం ఒక కళ.. యాంకర్ సుమ వదిలిన పారిజాత పర్వం
కిడ్నాప్ చేయడం ఒక కళ.. యాంకర్ సుమ వదిలిన పారిజాత పర్వం

Shraddha Das Paarijatha Parvam Trailer: చైతన్య రావు, సునీల్, హీరోయిన్ శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పారిజాత పర్వం. ఈ సినిమాను వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ వంటి ప్రమోషనల్ కంటెంట్ బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు తాజాగా పారిజాత పర్వం ట్రైలర్‌తో మేకర్స్ ముందుకు వచ్చారు. ఈ పారిజాత పర్వం మూవీ ట్రైలర్‌ను స్టార్ యాంకర్ సుమ కనకాల లాంచ్ చేశారు. మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ సీన్స్, డైలాగ్స్‌తోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను కట్ చేశారు.

''కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ అర్పుతారట, మళ్లీ లైట్స్ వేసేలోపు కేక్ తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి'' అంటూ కిడ్నాప్ ప్లాన్‌ని సునీల్ తన గ్యాంగ్‌తో చెబుతుండగా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్'అనే ట్యాగ్ లైన్‌ని జస్టిఫై చేస్తూ ఇందులో చూపించిన సన్నివేశాలు హిలేరియస్‌గా ఉన్నాయి.

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రల చుట్టూ నడిపిన కిడ్నాప్ సీక్వెన్స్‌లు హైలెట్‌గా ఉంటూ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అలరించింది. ట్రైలర్ చివర్‌లో వైవా హర్ష చెప్పిన సినిమా రివ్యూ హిలేరియస్‌గా ఉంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ అందరూ తమ ఫెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు.

దర్శకుడు సంతోష్ కంభంపాటి హిలేరియస్ కిడ్నాప్ డ్రామాని ప్రేక్షకులకు అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో వినిపించిన పాట, నేపథ్య సంగీతం క్యాచిగా ఉంటూ ఫన్‌ని మరింతగా ఎలివేట్ చేసేలా ఉంది. బాల సరస్వతి కెమరామెన్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్, నిర్మాణ విలవలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సశాంక్ వుప్పుటూరి ఎడిటర్‌గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ కామెడీ జోనర్‌లో వస్తున్న పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్‌తోపాటు వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ ఇటీవల సినిమాలు ఎక్కువగా చేయలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో సందడి చేయనుంది.

ఇక చైతన్య రావు 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కీడా కోలా మూవీతో అలరించిన చైతన్య ఇటీవలే షరతులు వర్తిస్తాయి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే కాకుండా తెప్ప సముద్రం అనే మరో సినిమా చేస్తున్నాడు. సునీల్ ఇటీవలే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ఆకట్టుకున్నాడు.