Paarijatha Parvam: బంపర్ ఛాన్స్ కొట్టేసిన 30 వెడ్స్ 21 హీరో.. శ్రద్ధా దాస్‌తో క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Paarijatha Parvam Teaser Released: 30 వెడ్స్ 21 సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్‌తో జోడీ కట్టి బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. వీరిద్దరూ నటించిన పారిజాత పర్వం టీజర్ తాజాగా విడుదలైంది.
Shraddha Das Chaitanya Rao: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు, శ్రద్ధా దాస్, సునీల్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పారిజాత పర్వం. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పారిజాత పర్వం మూవీకి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న పారిజాత పర్వం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే విడుదలైన పారిజాత పర్వం కాన్సెప్ట్ గ్లింప్స్ మంచి వ్యూస్‌తో పాటు రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు తాజాగా పారిజాత పర్వం టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమై చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో టీజర్ ప్రేక్షకులని అలరించేలా ఉంది. ఇక టీజర్ చివరిలో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది.
జై.. అని పనిమనిషిని తీసుకొచ్చావా అని అని వైవా హర్ష ఏదో ఇంటర్వ్యూలో డైరెక్టర్ బోయపాటి శ్రీను డైలాగ్‌ను ఇమిటేట్ చేసినట్లుగా ఉంది. సినిమా అంతా కిడ్నాప్ చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సునీల్ చేతిపై జై చిరంజీవా అనే టాటూ హైలెట్ అయింది. డైరెక్టర్ సంతోష్ కంభంపాటి హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
పారిజాత పర్వం టీజర్‌కి మ్యూజిక్ డైరెక్టర్ 'రీ' అందించిన నేపథ్యసంగీతం చాలా గ్రిపింగ్‌గా ఉంది. బాల సరస్వతి కెమరామెన్ పనితనం బ్రిలియంట్‌గా ఉంది. విజువల్స్, నిర్మాణ విలవలు ఉన్నతంగా కనిపించాయి. ఇక ఈ సినిమాకు సశాంక్ వుప్పుటూరి ఎడిటర్‌గా, ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే పారిజాత పర్వం మూవీకి అనంత సాయి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పారిజాత పర్వం సినిమాలో సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్షతోపాటు శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, టార్జాన్, గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి పలు పాత్రల్లో నటించనున్నారు. 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కీడా కోలా మూవీతో అలరించిన చైతన్య ఇటీవలే షరతులు వర్తిస్తాయి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే కాకుండా తెప్ప సముద్రం అనే మరో సినిమా చేస్తున్నాడు.